Yoga Asanas for Belly Fat | ఈ యోగా ఆసనాలు వేస్తే పొట్ట తగ్గిపోతుంది!-easy yoga asanas that help you reduce belly fat speedily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Asanas For Belly Fat | ఈ యోగా ఆసనాలు వేస్తే పొట్ట తగ్గిపోతుంది!

Yoga Asanas for Belly Fat | ఈ యోగా ఆసనాలు వేస్తే పొట్ట తగ్గిపోతుంది!

HT Telugu Desk HT Telugu
Aug 04, 2024 01:17 AM IST

Yoga Asanas To Reduce Belly Fat: ఉదర భాగంలో కొవ్వు కరిగించి ఫ్లాట్ పొట్టను కోరుకుంటే ఇక్కడ సూచించిన 5 యోగా ఆసనాలు వేయండి చాలు. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

Yoga Asanas To Reduce Belly Fat:
Yoga Asanas To Reduce Belly Fat: (Yoga Asanas To Reduce Belly Fat:)

పొట్టభాగంలో కొవ్వు పెరిగితే అది మీకు ఇబ్బందికరంగా అనిపించడమే కాకుండా, చూసేవారికి మీరు వయసు ఎక్కువ ఉన్నవారిలా కనిపిస్తారు. బెలూన్‌ లా ముందుకు ఉబ్బిన పొట్ట ఉంటే, ముందుగా అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. దీంతో అది తగ్గించేందుకు చాలా మంది చాలా రకాల సూచనలు ఇస్తారు. మీరు కూడా ఏవో రకాల విఫల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఎన్ని చేసినా పొట్ట తగ్గపోతే అది నిరాశ కలిగిస్తుంది. మరోవైపు మీ వంతు ప్రయత్నాలు చేయకపోతే పొట్ట ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.

మీరు జిమ్‌కు వెళ్లకుండా ఫ్లాట్ పొట్టను ప్రదర్శించాలని కోరుకుంటే, ఇంట్లోనే చేసే విధంగా మీకు యోగాలో వివిధ ఆసనాలు ఉన్నాయి. ఈ యోగా ఆసనాలు మీ పొత్తికడుపు ప్రాంతంపై ప్రభావం చూపుతాయి. మీ జీవక్రియను మెరుగుపరిచి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారం తీసుకుంటే మరింత వేగంగా ఫలితం పొందవచ్చు.

Yoga Asanas To Reduce Belly Fat:

మరి పొట్ట కొవ్వును తగ్గించడానికి ఎలాంటి యోగా ఆసనాలను సాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భుజంగాసనం

దీనినే కోబ్రా పోజ్(Cobra Pose) అని కూడా అంటారు. ఈ యోగ భంగిమ పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా వెన్నునొప్పి, శ్వాసకోశ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేస్తుంది.

ధనురాసనం

దీనిని Bow Pose అని కూడా అంటారు. ఇది మీ శరీరాన్ని విల్లులా వంచి, దాని ఫలితాలను అందిస్తుంది. మీ అబ్స్‌ను బలోపేతం చేయడంలో, పొట్ట కొవ్వును తగ్గించడంలో, వీపు, తొడలు, చేతులు, ఛాతీకి మంచి సాగతీతను అందించడంలో అత్యంత ప్రభావవంతమైనది.

ఉస్త్రాసనం

దీనిని ఒంటె భంగిమ (Camel Pose) అని కూడా అంటారు. మొండిగా పేరుకుపోయిన పొట్ట కొవ్వును కరిగించటానికి, మీకు మంచి ఫ్లెక్సిబిలిటీని అందించటానికి ఉస్త్రాసనం సహాయపడుతుంది. వెన్నునొప్పిని ఎదుర్కోవడానికి కూడా ఈ ఆసనం పనిచేస్తుంది.

నౌకాసనం

దీనిని పడవ భంగిమ (Boat Pose) అని కూడా అంటారు. ఇది మీ కడుపు కండరాలకు రెండు పక్కలా, అలాగే ముందు భాగంలో ప్రభావాన్ని కలిగిస్తుంది. నౌకాసనా మీ అబ్స్‌ను టోన్ చేస్తుంది, మీ కోర్‌ను బలపరుస్తుంది. ఈ ఆసనం వేసేటపుడు మీ శరీరాన్ని V-ఆకారంలో 45-డిగ్రీల కోణంలో ఉంచి 60 సెకన్ల పాటు పట్టుకోండి. లోతుగా శ్వాస తీసుకుంటూ వదలడం చేస్తే, జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

ఆపానాసనం

దీనిని knees to chest pose అని కూడా పిలుస్తారు. ఈ ఆపానాసనం పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడమే కాకుండా, ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. వెన్నునొప్పిని కూడా పరిష్కరిస్తుంది. ఈ భంగిమలో 15 సెకన్ల పాటు ఉండి ఆరు సార్లు రిపీట్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం