తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do These 5 Morning Stretches In The Bed And Get Energized

Morning Stretches | మంచం దిగకుండా ఉన్నచోటునే ఈ 5 రకాల స్ట్రెచింగ్స్ చేయండి

HT Telugu Desk HT Telugu

15 May 2022, 6:37 IST

    • బెడ్‌పై నుంచి దిగకుండా ఉన్నచోటునే వెల్లకిలా పడుకొని మీ శరీరాన్ని ఇక్కడ చెప్పినట్లుగా స్ట్రెచ్ చేయండి. మీకు వ్యాయామం అయినట్లు అవుతుంది. మీ ఒత్తిడి, ఆందోళన తగ్గి హుషారుగా నిద్రలేస్తారు.
Morning Stretches
Morning Stretches (Pixabay)

Morning Stretches

వీకెండ్ సమయాల్లో పొద్దున్నే లేవాలనిపించదు, కనీసం ఒక్కరోజైనా హాయిగా పడుకుందాం అనిపిస్తుంది. అలాంటపుడు రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేసే అలవాటుకు విరామం ప్రకటించినట్లు అవుతుంది. అలాకాకుండా మీరు బెడ్‌పై నుంచి దిగకుండా బాడీని అన్నివైపులా స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచింగ్ చేయడం ద్వారా మీ ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మీరు లేచినవెంటనే మీకు తాజాగా అనిపిస్తుంది. 

ఈ రకమైన స్ట్రెచింగ్ చేయటానికి మీరు మీ యోగా మ్యాట్‌ను అన్‌రోల్ చేయాల్సిన అవసరం లేదు, కనీసం బెడ్ మీద నుంచి దిగాల్సిన పనికూడా లేదు. ఉన్నచోటునే చేసేటువంటి 5 స్ట్రెచ్‌లను ఇక్కడ పేర్కొన్నాం.

1. మోకాలిని ఛాతీ వరకు వంచండి

వెల్లకిలా పడుకొకి మీ ఎడమ మోకాలిని వంచి మీ ఛాతీ భాగానికి తాకేలా చేయండి. ఇలా 30 సెకన్ల పాటు పట్టుకోండి. అనంతరం వదిలేసి, ఇదే తరహాలో మీ కుడి మోకాలిని ఛాతీ భాగానికి ఆనించండి. 30 సెకన్ల పాటు అలాగే అదిమిపట్టుకొని ఆపై రిలాక్స్ అవ్వండి.

2. లైయింగ్ స్పైనల్ ట్విస్ట్

వెల్లకిలా పడుకోండి. మీ రెండు కాళ్ల మధ్య సందు లేకుండా దగ్గరికి జరుపుకోండి. రెండు మోకాళ్లను ఒకవైపు ఉంచి నడుమును మాత్రమే ఒకవైపు స్ట్రెచ్ చేయండి. 30 సెకన్లపాటు అలాగే పట్టుకొని, తర్వాత మరోవైపు ప్రయత్నించండి.

3. హ్యాపీ బేబీ స్ట్రెచ్

శిషువులు తమకు తెలియకుండానే తమ చిట్టి కాళ్లను తమ చేతులతో పట్టుకునే ప్రయత్నం చేస్తూ అడుకుంటారు. అందుకే దీనికి బేబీ స్ట్రెచ్ అని పేరు. ఇప్పుడు దీనిని మీరు ప్రయత్నించండి.

వెల్లకిలా పడుకోండి. మీ ఎడమ మోకాలిని వంచి రెండు చేతులతో మీ పాదాలను గట్టిగా లాగిపట్టుకోండి. 30 సెకన్ల తర్వాత రిలాక్స్ అయి, మరోవైపు ఇలాగే చేయండి. ఇలా ఒక్కో పాదాన్ని 30 సెకన్ల పాటు పట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ మోకాళ్లను ఛాతీవైపు వంచి, మీ రెండు పాదాలను ఒకేసారి మీ చేతులతో పట్టుకుని 30 సెకన్ల పాటు ఉంచి రిలాక్స్ అవ్వండి.

4. రిక్లైనింగ్ హామ్ స్ట్రింగ్ స్ట్రెచ్

వెల్లకిలా పడుకోండి. మీ ఎడమ కాలును మాత్రమే నిటారుగా పైకి ఎత్తండి. మీ రెండు చేతులతో మీ తొడ భాగంలో పట్టుకొని ఉండండి. మోకాలు వంగినట్లు కాకుండా ఫ్లాట్‌గా సాగదీయండి. ఇలా 30 సెకన్లపాటు ఉంచండి. ఇప్పుడు రిలాక్స్ అయి, ఇదే తరహాలో కుడికాలును ఫ్లాట్‌గా పైకి ఎత్తి 30 సెకన్లపాటు ఉండండి.

5. ఫిష్ స్ట్రెచ్

వెల్లకిలా పడుకోండి. ఈ భంగిమలో మీ కాళ్లు పూర్తిగా బెడ్ మీద ఉంటాయి. కేవలం మీ రెండు భుజాల సపోర్టుతో మీ మొండెంను పైకెత్తి ఉంచండి. కాళ్లు సమానంగా దగ్గరికి చాచి ఉండాలి. మీ నడుముకు బెడ్ కు మధ్య గ్యాప్ రావాలి. మీ తల కూడా బెడ్ కు తాకకుండా గాలిలోనే ఉంటుంది. దీనిని ఫిష్ స్ట్రెచ్ అంటారు. ఇది ఒక 30 సెకన్ల పాటు చేయండి.

టాపిక్