తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme C30s Debuts In India । రియల్‌మి బడ్జెట్ ఫోన్.. ధర రూ. 7 వేలలోనే!

Realme C30s Debuts In India । రియల్‌మి బడ్జెట్ ఫోన్.. ధర రూ. 7 వేలలోనే!

HT Telugu Desk HT Telugu

14 September 2022, 17:06 IST

    • రియల్‌మి నుంచి Realme C30s అనే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఇది రూ. 7 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. వివరాలు చూడండి.
Realme C30s
Realme C30s

Realme C30s

మొబైల్ తయారీదారు రియల్‌మి తమ C-సిరీస్ కింద మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Realme C30s పేరుతో పరిచయం అయిన ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే లభించే ఒక ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్. కొన్ని నెలల క్రితం రియల్‌మి విడుదల చేసిన Realme C30 మోడల్‌కు ఇది మెరుగైన వెర్షన్.

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ కూడా దాని పాత వెర్షన్ ధరతోనే విడుదలైంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా దాదాపు అవే ఉన్నాయి. అయితే అదనంగా ఇందులో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందిస్తున్నారు. ర్యామ్ కెపాసిటీ కూడా స్వల్పంగా పెరిగింది. Realme C30s స్మార్ట్‌ఫోన్‌ చూడటానికి అదే పాత Realme C30 సూట్‌కేస్ డిజైన్‌ను కలిగి ఉండటం గమనార్హం.

ఈ ఫోన్ స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది.

సరికొత్త Realme C30sలో మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.

Realme C30s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 2GB/ 4GB RAM, 32GB/64GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ Unisoc SC9863A1 ప్రాసెసర్
  • వెనకవైపు 8 MP కెమెరా LED ఫ్లాష్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 4.2, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ , 4G ఎల్‌టిఇ కనెక్టివిటీ ఉన్నాయి.

Realme C30s స్మార్ట్‌ఫోన్‌ 2GB RAM వేరియంట్ కోసం ధర, రూ. 7,499 అలాగే 4GB RAM వేరియంట్ కోసం ధర, రూ. 8,999/-

ఈఫోన్ ప్రత్యేకంగా Flipkart అలాగే Realme స్టోర్లలో సెప్టెంబర్ 23 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

టాపిక్