తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Redmi A1 । కేవలం రూ. 6 వేలకే స్మార్ట్‌ఫోన్‌.. Redmi 11 Prime 5g, 4g కూడా లాంచ్!

Redmi A1 । కేవలం రూ. 6 వేలకే స్మార్ట్‌ఫోన్‌.. Redmi 11 Prime 5G, 4G కూడా లాంచ్!

HT Telugu Desk HT Telugu

06 September 2022, 19:34 IST

google News
    • రెడ్‌మి కేవలం రూ. 6 వేల బడ్జెట్ ధరలో Redmi A1 అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనితో Redmi Prime 11 5G అలాగే Redmi Prime 11 4G అనే మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఆ వివరాలు చూడండి.
Redmi A1, Redmi Prime 11 5G & Redmi Prime 11 4G smartphones launched
Redmi A1, Redmi Prime 11 5G & Redmi Prime 11 4G smartphones launched

Redmi A1, Redmi Prime 11 5G & Redmi Prime 11 4G smartphones launched

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ రెడ్‌మి భారత మార్కెట్లో ఈరోజు మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో తక్కువ ధరలో లభించే ఒక ఎంట్రీలెవెల్ ఫోన్‌తో పాటు మరో రెండు సాధారణ బడ్జెట్ రేంజ్ ఫోన్‌లు ఉన్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే.. బేసిక్ మోడల్ Redmi A1 సింగిల్ స్మార్ట్‌ఫోన్‌ ఏకైక వేరియంట్లో లభిస్తుంది. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఈ ఫోన్ కేవలం రూ. 6499/- ధరకే లభిస్తుంది.

అదే విధంగా, మరో రెండు మోడల్స్ Redmi Prime 11 5G అలాగే Redmi Prime 11 4G కూడా ప్రత్యేక తగ్గింపుతో రూ. 12,999కే అందుబాటులో ఉంటాయి. Redmi Prime 11 5G లో 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999/- గా నిర్ణయించారు. ICICI బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేసే వారికి రూ. 1000 తగ్గింపు ఉంటుంది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. ఇవి మెడో గ్రీన్, క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్, ప్లేఫుల్ గ్రీన్, ఫ్లాషీ బ్లాక్, పెప్పీ పర్పుల్‌ వంటి కలర్ ఆప్షన్లలో లభ్యమవుతాయి.

Redmi A1 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.52 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 2GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G22 ప్రాసెసర్
  • వెనకవైపు 8MP+AI డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

ధర, రూ.6499/-

Redmi Prime 11 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల IPS LCD పూర్తి HD+ డిస్‌ప్లే

4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్

వెనకవైపు 50MP + డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జర్

Redmi Prime 11 4G వెర్షన్ కూడా అన్నీ ఇవే ఫీచర్లను కలిగి ఉంది. అయితే 4G వెర్షన్‌లో వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5G వెర్షన్‌లో డ్యూయల్ కెమెరా మాత్రమే ఇచ్చారు.

ధరలు, రూ. 12,999 నుంచి రూ. 14,999/-

టాపిక్

తదుపరి వ్యాసం