తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Redmi Note 11 Se స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 10కి రీబ్రాండ్ వెర్షనేనా?

Redmi Note 11 SE స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 10కి రీబ్రాండ్ వెర్షనేనా?

HT Telugu Desk HT Telugu

02 August 2022, 22:09 IST

    • చైనీస్ కంపెనీ రెడ్‌మి Redmi Note 11 SE అనే స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే కంపెనీ పాత ఫోన్ కు పేరు మార్చి విడుదల చేస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు చూడండి.
Redmi Note 11 SE
Redmi Note 11 SE

Redmi Note 11 SE

చైనీస్ టెక్ కంపెనీ Xiaomi సబ్-బ్రాండ్ అయిన Redmi భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. రెడ్‌మి త్వరలో నోట్ 11 సిరీస్‌లో కొత్త హ్యాండ్‌సెట్‌‌ను విడుదల చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. వాటి ప్రకారం రెడ్‌మి నోట్ 10కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా Redmi Note 11 SE మొబైల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను రెడ్‌మి బ్రాండ్ ఇటీవలే చైనాలో లాంచ్ చేసింది. అయితే భారతీయ వెర్షన్ పూర్తిగా దానికి భిన్నమైన వేరియంట్‌గా ఉండే అవకాశం ఉంది. ఇదే విధమైన స్మార్ట్‌ఫోన్‌ను ఇతర దేశాల మార్కెట్లో Poco M5sకి రీబ్రాండ్ వెర్షన్‌గా లాంచ్ చేసినట్లు నివేదిక సూచించింది.

మరి ఈ Redmi Note 11 SE భారతీయ వేరియంట్లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉండవచ్చో విశ్లేషకులు అంచనా వేశారు. అవి ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

New Redmi Note 11 SE స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+8MP + 2MP+ 2MP కెమెరా సెటప్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

మరి దీని ధర, ఇతర వివరాలు లాంచ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. అయితే Xiaomi ఇప్పటికే ఉన్న ఫోన్‌ని పేరు మార్చి మళ్లీ లాంచ్ చేయడం ఏంటని మార్కెట్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం