తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo Reno 8 Lite 5g । కొత్త డబ్బాలో పాత ఫోన్.. ఒప్పో మార్కెటింగ్ ట్రిక్!

Oppo Reno 8 Lite 5G । కొత్త డబ్బాలో పాత ఫోన్.. ఒప్పో మార్కెటింగ్ ట్రిక్!

HT Telugu Desk HT Telugu

06 June 2022, 11:27 IST

    • ఒప్పో కంపెనీ ఒకటే ఫోన్‌ను నాలుగు పేర్లతో విక్రయిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు కనిపెట్టారు. ఒప్పో కంపెనీ తాజాగా విడుదల చేసిన Oppo Reno 8 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ గతంలో విడుదల చేసిన ఫోన్ల లాగే ఉంది.
Oppo Reno 8 Lite 5G
Oppo Reno 8 Lite 5G

Oppo Reno 8 Lite 5G

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో తమ బ్రాండ్ నుంచి Reno 8 సిరీస్‌లో తాజాగా Oppo Reno 8 Lite అనే 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఒప్పో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తమ హోమ్ మార్కెట్ చైనాలో కాకుండా స్పెయిన్‌లో విడుదల చేయడం గమనార్హం. 

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మరొక విషయం ఏమిటంటే ఈ సరికొత్త Oppo Reno 8 Lite 5G ఫోన్ ఇంతకు ముందు వచ్చిన Oppo Reno 7 Lite రీబ్రాండెడ్ వెర్షన్ లాగా ఉంది. ఈ క్రమంలో కొత్త రెనో 8 లైట్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు దాదాపు అన్నీ Oppo Reno 7 Lite మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఇవే ఫీచర్లు ఒప్పో F21 ప్రో, ఒప్పో రెనో 7Z 5G ఫోన్లలోనూ కనిపిస్తాయి.

దీని ప్రకారం Oppo కంపెనీ ఒకటే స్మార్ట్‌ఫోన్‌ను పేర్లు మార్చి కొత్త వెర్షన్లుగా విక్రయిస్తోందని, ఇది తమ మార్కెటింగ్ ట్రిక్ అయి ఉంటుందేమోనని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Oppo Reno 8 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్

వెనకవైపు 64MP +2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

ధర యూరోప్ దేశాలలో EUR 429. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 35,500/-

కొద్దిరోజుల కిందట ఒప్పో F21 ప్రో 5G ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. వాటి ఫీచర్లు ఒకసారి గమనించండి.

Oppo F21 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్

వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 26,999/-

రెండింటినీ గమనిస్తే దాదాపు తేడా ఏం లేదు. కాబట్టి ఒకవేళ ఒOppo Reno 8 Lite 5G ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే దాని కంటే తక్కువ ధరకు Oppo F21 Pro 5G కొనుగోలు చేయడం ఉత్తమం.

టాపిక్

తదుపరి వ్యాసం