Redmi 11 Prime 5G । 'సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ నేమ్‌' తో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్!-xiaomi to launch redmi 11 prime 5g with redmi note 11e chip similar as poco m4 5g ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Xiaomi To Launch Redmi 11 Prime 5g With Redmi Note 11e Chip Similar As Poco M4 5g

Redmi 11 Prime 5G । 'సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ నేమ్‌' తో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్!

HT Telugu Desk HT Telugu
Aug 31, 2022 10:22 PM IST

రెడ్‌మి నుంచి సరికొత్త Redmi 11 Prime భారత మార్కెట్లో విడుదల కాబోతుంది. ఇది బడ్జెట్ ధరలో లభించే 5G స్మార్ట్ ఫోన్. దీని వివరాలు స్టోరీలో చదవండి.

Redmi 11 Prime 5G
Redmi 11 Prime 5G

Xiaomi సబ్-బ్రాండ్ అయిన Redmi భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. సరికొత్త Redmi 11 Prime 5Gని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 6, 2022న భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ అవుతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ వంటి మెరుగైన ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా ఇది సరసమైన ధరలోనే లభించే 5G ఫోన్‌గా మార్కెట్లోకి రాబోతుంది సమాచారం.

అయితే ఈ ఫోన్ ఇటీవల చైనాలో విడుదల చేసిన Redmi Note 11 SE స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండ్ వెర్షన్ అని చాలా మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. మళ్లీ ఈ Note 11 SE కూడా గతంలో వచ్చిన Redmi 10 Primeకి సక్సెసర్. అంటే Redmi కంపెనీ ఒకటే మోడల్ ఫోన్‌ను రీరీబ్రాండ్ చేసి విడుదల చేస్తుందా అని మార్కెట్ విశ్లేషకలు అనుమానిస్తున్నారు. అధికారికంగా విడుదల అయితే కానీ ఏ విషయం అనేది ఇప్పుడే అంచనా వేయలేం.

అలాగే ఈ Redmi 11 Prime 5Gకి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు కొన్ని లీక్ అయ్యాయి. Redmi 11 Prime 5G మోడల్ నంబర్ 1919lతో IMEI డేటాబేస్‌లో గుర్తించగా, దీని కోడ్‌నేమ్ Poco M4 5Gకు మ్యాచ్ అయింది. అంటే ఇది మళ్లీ Poco M4 5G స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్. మొత్తంగా ఇది మిక్స్ డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపించే ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు Redmi 11 Prime 5G స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉండవచ్చో ఒక లుక్ వేయండి.

Redmi 11 Prime 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల IPS LCD పూర్తి HD+ డిస్‌ప్లే
  • 6GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జర్

ఈ స్మార్ట్‌ఫోన్ గ్రే, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లు లేవు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్