తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Redmi K50 Extreme Edition । ఎక్స్‌ట్రీమ్ ఫీచర్లతో వచ్చిన రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌!

Redmi K50 Extreme Edition । ఎక్స్‌ట్రీమ్ ఫీచర్లతో వచ్చిన రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

11 August 2022, 22:38 IST

    • షావోమి కంపెనీ సరికొత్త Redmi K50 Extreme Edition స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. ధర, ఇతర వివరాలను తెలుసుకోండి.
Redmi K50 Extreme Edition
Redmi K50 Extreme Edition

Redmi K50 Extreme Edition

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్‌మి బ్రాండ్ నుంచి సరికొత్త Redmi K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ విడుదలైంది. వెనిల్లా K50, K50 Pro అలాగే K50 గేమింగ్ ఎడిషన్ తర్వాత K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ఈ సిరీస్‌లో వచ్చిన నాల్గవ స్మార్ట్‌ఫోన్. అయితే K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్లో Qualcomm Snapdragon ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను కలిగి ఉండటం సిరీస్‌లో మొదటిసారి.

ట్రెండింగ్ వార్తలు

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌ ఫోన్‌కు గ్లాస్ బ్యాక్ ఉంది. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్-కెమెరా సెటప్ కూడా ఉంది. 108MP Samsung HM6 సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది.

ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్ కలిగి, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే పరిమితి ఇంతవరకే. ఎందుకంటే ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు.

అదనంగా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

Redmi K50 Extreme Edition స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128GB/256GB/512GB స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 108MP+8MP+ 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 20 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 120W ఫాస్ట్ ఛార్జర్

ఇంకా Redmi K50 Extreme Edition బ్లూటూత్ 5.2, WiFi 6E, NFC, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ , AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌ మొదలైన ఫీచర్లను కలిగి ఉంది.

8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2999 (దాదాపు రూ. 35,400).

12GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,599 (దాదాపు రూ. 42,500)

12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3999 (దాదాపు రూ. 47,200)

ప్రస్తుతం చెనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను రెడ్‌మి కంపెనీ ఎంపిక చేసిన ఇతర దేశాల మార్కెట్లలో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం