తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme Pad X 5g | స్మార్ట్ కీబోర్డ్‌తో రియల్‌మి నుంచి సరికొత్త టాబ్లెట్..!

Realme Pad X 5G | స్మార్ట్ కీబోర్డ్‌తో రియల్‌మి నుంచి సరికొత్త టాబ్లెట్..!

HT Telugu Desk HT Telugu

26 July 2022, 21:16 IST

    • రియల్‌మి తాజాగా 'Realme Pad X' పేరుతో మరొక సరికొత్త టాబ్లెట్ ఫోన్ ను ఆవిష్కరించింది
Realme Pad X
Realme Pad X

Realme Pad X

మొబైల్ తయారీదారు రియల్‌మి గత మే నెలలోనే 'Realme Pad X' పేరుతో ఒక ప్రీమియం టాబ్లెట్ పీసీని చైనాలో ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ టాబ్లెట్ భారత మార్కెట్లోనూ విడుదలయింది. అయితే మన వద్ద విడుదలైన మోడల్ కొద్దిగా భిన్నంగా ఉంది. ఇండియాలో విడుదలైన మోడల్ 5G కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. ఇది లైమ్‌లైట్ అనే అదనపు ఫీచర్‌తో వచ్చింది. ఈ ఫీచర్ Apple టెక్నాలిజీలోని సెంటర్ స్టేజ్‌ని పోలి ఉంటుంది. Google Duo, Google Meet, Zoom వంటి కాన్ఫరెన్స్ కాల్స్ కోసం ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ 5G టాబ్లెట్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది ఫోటోలు, వీడియోలను తీయడానికి మాత్రమే కాకుండా టెక్ట్స్ స్కానర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించి చిత్రాల నుంచి టెక్ట్స్ ట్రాన్స్‌క్రైబ్ చేయవచ్చు. ఇక ఇండియన్ ప్యాడ్ X మోడల్ మిగతా స్పెక్స్‌లు అన్నీదాని చైనీస్ కౌంటర్‌పార్ట్‌తో సమానంగా ఉంటాయి.

Pad Xతో పాటు Realme మన మార్కెట్లో Realme పెన్సిల్, Realme స్మార్ట్ కీబోర్డ్‌లను కూడా విడుదల చేసింది. Realme స్మార్ట్ కీబోర్డ్ 1.3mm కీ ట్రావెల్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ కీబోర్డ్‌లో 280 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 112 గంటల పాటు నిరంతరాయంగా టైపింగ్‌కు వీలు కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది. కీలు కూడా చర్మానికి అనుకూలమైన PU మెటీరియల్‌తో తయారు చేసినవి. దీనిని బ్లూటూత్ ద్వారా ప్యాడ్ Xతో కనెక్ట్ చేసుకోవచ్చు.

Realme పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ విడివిడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కీబోర్డ్ ధర రూ. 4,999/- గా ఉండగా స్టైలస్ ధరరూ. 5,499/- గా ఉంది.

Realme Pad X మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? ఇతర వివరాలను ఈ కింద పేర్కొన్నాం.

Realme Pad X టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 11-అంగుళాల LCD డిస్‌ప్లే, 2K రిజల్యూషన్‌
  • 4GB/ 6GB RAM, 64GB/128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 105 డిగ్రీల వీక్షణనిచ్చే 8MP కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 8340mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్

4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 17,999/-

6GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 25,999/-

ఈ టాబ్లెట్ వైఫై వెర్షన్‌లో మాత్రమే వస్తుంది. ఈ Realme Pad X టాబ్లెట్ పీసీ Flipkart, Realme.com ఇతర మెయిన్‌లైన్ ఛానెల్‌లలో ఆగస్టు 1 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం