Lenovo Tab P11 Plus । 15 గంటల ప్లేబ్యాక్ టైమ్ కలిగిన బ్యాటరీతో లెనొవొ టాబ్లెట్!
14 July 2022, 22:37 IST
- లెనొవొ నుంచి ఇటీవల Lenovo Tab P11 Plus అనే టాబ్లెట్ విడుదలైంది. మీడియం రేంజ్ బడ్జెట్లో టాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే అది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
Lenovo Tab P11 Plus
పీసీ మేకర్ భారత మార్కెట్లో లెనొవొ ఇటీవల Lenovo Tab P11 Plus పేరుతో ఒక మిడ్-రేంజ్ టాబ్లెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మనకు దేశీయంగా అందుబాటులో ఉన్న గెలాక్సీTab S6 Lite, షావోమి Pad 5, ఆపిల్ iPad 9th-gen వంటి టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
డిజైన్ పరంగా ఈ సరికొత్త Lenovo Tab P11 డ్యూయల్-టోన్ బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్‌తో వస్తుంది. వేరు చేయగలిగిన కీబోర్డ్, ఇతర ఉపకరణాల అనుసంధానం కోసం టాబ్లెట్ PC దిగువన పోగో-పిన్‌లను కలిగి ఉంది. టాబ్లెట్‌లో 11 అంగుళాల 2K డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే క్వాడ్ స్పీకర్లను ఇచ్చారు. దీనిలోని బ్యాటరీ 15 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Lenovo Tab P11 Plus టాబ్లెట్ PC ఏకైక ర్యామ్- స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. అలాగే ఇది 'స్లేట్ గ్రే' అనే ఏకైక కలర్ ఆప్షన్లో లభిస్తుంది. ఈ టాబ్లెట్ ఇప్పటికే Lenovo ఆన్‌లైన్ స్టోర్‌లో అలాగే Amazonలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇంకా Lenovo Tab P11 Plusకి సంబంధించి మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ధర ఎంత? తదితర వివరాలు ఈ క్రింద తెలుసుకోండి.
Lenovo Tab P11 Plus టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
11-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
6 GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ స్లాట్
మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్
వెనకవైపు 13MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
7700 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జింగ్
ధర, రూ. 25,999/-
కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్ PCలో బ్లూటూత్ 5.1తో పాటు ప్రామాణిక సెన్సార్లు, Wi-Fi ఆప్షన్స్, టైప్-సి పోర్ట్ ఉన్నాయి.