Realme Pad X । సెన్సిటివ్ స్టైలస్‌తో రియల్‌మి నుంచి తొలి ప్రీమియం టాబ్లెట్!
రియల్‌మి నుంచి మరో టాబ్లెట్ ఫోన్ విడుదలయింది. Realme Pad X పేరుతో ఈ హ్యాండ్‌సెట్ Realme కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ప్రీమియం టాబ్లెట్ ఫోన్. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి..
మొబైల్ తయారీదారు రియల్‌మి తాజాగా 'Realme Pad X' పేరుతో మరొక సరికొత్త టాబ్లెట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. Realme Pad X అనేది కంపెనీ నుంచి వచ్చే మొట్టమొదటి ప్రీమియం టాబ్లెట్. ఇది ఇటీవల లాంచ్ అయిన Xiaomi Pad 5 కంటే కూడా మెరుగైనది. అయితే ఈ సరికొత్త Realme Pad X టాబ్లెట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న Samsung Galaxy Tab S8 వంటి హై-ఎండ్ టాబ్లెట్ తో మాత్ర పోటీ పడలేదు. కాకపోతే Realme లాంచ్ చేసిన అన్నింటి కంటే శక్తివంతమైనది అని చెప్పవచ్చు.
ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో Realme Pad Xకి సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధరలు ఏ మేరకు ఉండొచ్చో ఇక్కడ చూడండి.
Realme Pad X టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 11-అంగుళాల LCD డిస్‌ప్లే, 2K రిజల్యూషన్
- 4GB/ 6GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 105 డిగ్రీల వీక్షణనిచ్చే 8MP కెమెరా
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 8340mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్
- ధర రూ. 14 వేల నుంచి రూ.18 వేల వరకు
ఈ టాబ్లెట్ వైఫై వెర్షన్‌లో మాత్రమే వస్తుంది. Realme UI 3.0 ఆధారంగా ప్యాడ్ పనితీరు కనబరుస్తుంది. స్క్రీన్ పై ఒత్తిడి తగ్గించేలా సెన్సిటివ్ స్టైలస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. Realme Pad X స్టార్ గ్రే, సీ సాల్ట్ బ్లూ, బ్రైట్ చెస్‌బోర్డ్ గ్రీన్ గ్రే, బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.
సంబంధిత కథనం