తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Diet | పూర్తిగా ప్రోటీన్స్​తో నిండిన హెల్తీ స్మూతీ.. మీరు ట్రై చేయండి..

Healthy Diet | పూర్తిగా ప్రోటీన్స్​తో నిండిన హెల్తీ స్మూతీ.. మీరు ట్రై చేయండి..

HT Telugu Desk HT Telugu

10 May 2022, 8:43 IST

    • మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ అస్సలు స్కిప్​ చేయవద్దని నిపుణులు సూచిస్తారు. ఒక్కోసారి మనకు బ్రేక్​ఫాస్ట్​ తినాలని అనిపించదు. బ్రేక్​ఫాస్ట్ చేయకపోతే శరీరంలో శక్తి ఉండదు. అలాంటప్పుడు మీరు స్మూతిని ప్రయత్నించవచ్చు. మీకోసం ఇక్కడ ఓ హెల్తీ స్మూతీ రెసిపీ ఎదురుచూస్తుంది. అదేంటో మీరు తెలుసుకుని.. ఇంట్లో తయారు చేసుకుని.. రోజంతా శక్తివంతంగా ఉండండి.
స్మూతీ
స్మూతీ

స్మూతీ

Morning Protein Diet | మార్నింగ్ ప్రోటీన్​ తీసుకోవాలనుకునే వారు, గ్లూటన్​ ఫ్రీ డ్రింక్స్ మాత్రమే తాగాలనుకునే వారు.. కండరాల బలాన్ని పెంచుకోవాలనుకునే వారు ఈ హెల్తీ స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే జిమ్​కు వెళ్లేవారు.. తమ డైట్​లో ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. అలాంటి వారికి ఈ స్మూతీ చాలా శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా కండరాలకు మంచి బలాన్ని ఇస్తుంది. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్మూతీని ఎలా తయారు చేయాలో.. దానిలో ఎన్ని కేలరీలు ఉన్నాయో వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* వేయించిన శెనగలు - 2 టేబుల్ స్పూన్స్

* వేయించిన పల్లీలు - 2 టేబుల్ స్పూన్స్

* పుచ్చకాయ గింజలు - 1 స్పూన్

* ఓట్స్ - 2 స్పూన్స్

* ఖర్జూరం -1

* పాలు -1 కప్పు

* అరటిపండు -1

* చియా సీడ్స్ - 2 స్పూన్స్ నానబెట్టినవి

తయారీ విధానం

శెనగలు, పల్లీలు, పుచ్చకాయ గింజలు, ఓట్స్, ఖర్జూరం, పాలు, అరటిపండు మిక్సీలో వేసి మిక్స్ చేయాలి. ఇది స్మూతీ లాగా వచ్చేంత వరకు మిక్సీ చేస్తూనే ఉండాలి. అనంతరం ఓ గ్లాసు తీసుకుని దానిలో చియా సీడ్స్ వేయాలి. స్మూతీ వేసి.. దానిపై డ్రై ఫ్రూట్స్​తో గార్నిష్ చేయాలి. అంతే చాలా సింపుల్​గా తయారు చేసుకునే స్మూతీ. దీనిని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటే.. డే అంతా మీకు శక్తి అందుతుంది.

ఈ స్మూతీలో మొత్తం 580 కేలరీలు ఉన్నాయి. ప్రొటీన్ 20.6 గ్రాములు, మంచి కొవ్వులు 23.7, కార్బ్స్ 71.6 గ్రాములు, ఫైబర్ 8.1 గ్రాములు ఉంటాయి. కాబట్టి ఉదయం జిమ్ నుంచి వచ్చిన వెంటనే దీనిని తీసుకోవచ్చు. మీ రెగ్యూలర్ డైట్ లో యాడ్ చేసుకోవచ్చు.

టాపిక్