తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vegan Smoothie | ఈ స్మూతీ కండరాలకు బలమిస్తుంది.. పైగా వీగన్ ఫ్రీ

Vegan Smoothie | ఈ స్మూతీ కండరాలకు బలమిస్తుంది.. పైగా వీగన్ ఫ్రీ

HT Telugu Desk HT Telugu

13 April 2022, 12:04 IST

    • సమ్మర్​లో హైడ్రేట్​గా ఉండేందుకు కొబ్బరినీరు తీసుకుంటాం. కానీ కొబ్బరిని మాత్రం వదిలేస్తాం. కొందరు దానిని తింటారు కానీ.. మరికొందరు ఆ కొబ్బరిని అలానే పడేస్తారు. అలాంటి వారు కొబ్బరితో ఈ స్మూతీని తయారుచేసుకోండి. ఇది కండరాలకు బలం చేకూర్చుతుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాల బలానికి స్మూతీ
కండరాల బలానికి స్మూతీ

కండరాల బలానికి స్మూతీ

కండరాల బలహీనత చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అలాంటివారు ఈ బలహీనతపై దృష్టిపెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. అందుకే ఈ స్మూతిని మీ ముందుకు తీసుకువచ్చాము. పైగా ఇది పూర్తిగా వీగన్ స్మూతీగా చెప్పవచ్చు. పాలు, పెరుగు వంటివి ఇష్టపడని వారు.. ఈ స్మూతీని చక్కగా తీసుకోవచ్చు. ఇది వీగన్ ఫ్రీ, గ్లూటన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ స్మూతీ. ఇన్ని ఫ్రీలుంటే.. మీరు ఎలా కాదనగలరు. దీనిని బ్రేక్ ఫాస్ట్ లేదా బ్రంచ్ వలె తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీకి కావాల్సిన పదార్థాలెంటో.. తయారీ ఏ విధంగానో చుద్దాం.

కావాల్సిన పదార్థాలు

* కొబ్బరి - అరకప్పు

* ఓట్స్ - 20 గ్రాములు (నానబెట్టాలి)

* బాదం - 4 (నానబెట్టాలి)

* అరటిపండు - 1

* పుచ్చకాయ గింజలు - అరస్పూన్

* చియా సీడ్స్ - 2 స్పూన్లు (నానబెట్టాలి)

* ఖర్జూరం - 2

తయారీ విధానం

ముందుగా కొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీ జార్​లో వేయాలి. దానిలో నానబెట్టిన ఓట్స్ వేయాలి. పుచ్చకాయ గింజలు, ఖర్జూరం, బాదం వేసి స్మూతీ వలె మిక్సీచేసుకోవాలి. ఒక గ్లాసులో నానబెట్టిన చియా సీడ్స్ వేయాలి. అనంతరం స్మూతీ వేసుకోవాలి. నచ్చిన డ్రైఫ్రూట్స్​తో గార్నీష్ చేసుకోవాలి. అంతే సింపుల్ అండ్ కండరాలకు బలాన్ని ఇచ్చే స్మూతీ రెడీ.

దీనిలో 435 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 7.2 గ్రాములు, ఫైబర్ 9.1 గ్రాములు, మంచి కొవ్వులు 19.5 గ్రాములు, కార్బ్స్- 60 గ్రాములు ఉంటాయి. కాబట్టి దీనిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు. ఈ స్మూతీ టేస్ట్​తో పాటు.. మంచి కొవ్వులు, కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్స్, విటమిన్స్ కలిగి ఉంటాయి. పైగా ఇది గ్లూటన్ ఫ్రీ. డెయిరీ ఫ్రీ.

టాపిక్

తదుపరి వ్యాసం