తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Hair Straightening । రింగుల జుట్టును నిటారుగా మార్చడానికి సహజమైన పద్ధతులు ఇవిగో!

DIY Hair Straightening । రింగుల జుట్టును నిటారుగా మార్చడానికి సహజమైన పద్ధతులు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

17 March 2023, 11:37 IST

    • DIY Hair Straightening: ఉంగరాల జుట్టును, చిక్కులు పడిన జుట్టును దువ్వుకోవడం కష్టంగా ఉందా? మీరు మీ రింగుల జుట్టును నిటారుగా మార్చుకోవాలనుకుంటే ఈ సహజమైన DIY మార్గాలు చూడండి.
 Hair Straightening
Hair Straightening (Unsplash)

Hair Straightening

ఉంగరాల జుట్టు గురించి అందంగా వర్ణిస్తారు, రింగు రింగుల జుట్టు ఉండటం అదృష్టం అని చెబుతారు. కానీ ఎక్కువ మంది సొగసైన, నిటారుగా ఉండే జుట్టునే కోరుకుంటారు. ముఖ్యంగా ఉంగరాల జుట్టు ఉన్నవారు వారి వెంట్రుకలను నిటారుగా చేయడానికి చాలా తంటాలు పడుతుంటారు. జుట్టుకు ఒక ఆకారాన్ని ఇవ్వడానికి గంటల తరబడి దువ్వుతూ ఉంటారు. ఎంత సేపు దువ్వినప్పటికీ, దువ్వెన అరిగిపోతుంది కానీ వారి జుట్టు మాత్రం చెక్కు చెదరదు.

ఏది ఏమైనా తమ రింగుల జుట్టును నిటారుగా చేసుకోవాలనుకునే వారు రసాయనాల చికిత్సను, బ్లో డ్రైయింగ్, ఐరన్‌లతో స్ట్రెయిట్‌నింగ్ వంటి విధానాలను అవలంబిస్తున్నారు. ఈ రకంగా చేయడం వలన తాత్కాలికంగా జుట్టు నిటారుగా మారుతుంది కానీ, జుట్టులో ఉన్న సహజమైన తేమ తొలగిపోతుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా మారడం, చిక్కులు పడటం జరుగుతుంది, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.

రింగుల జుట్టును నిటారుగా చేసుకునేందుకు సురక్షితమైన,ప్రభావవంతమైన సహజ నివారణ పద్ధతులు కూడా ఉన్నాయి. మీ జుట్టు రింగురింగులుగా ఉన్నా, చిక్కులు పడినట్లుగా ఉన్నా, చిట్లిపోయినట్లు ఉన్నా కొన్ని DIY చిట్కాల ద్వారా పరిష్కరించవచ్చు.

DIY Hair Straightening Tips - జుట్టును నిటారుగా చేసే సహజ మార్గాలు

ఈ సహజమైన చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలగకుండా స్ట్రెయిట్, హెల్తీ లుక్‌ను సాధించడంలో మీకు సహాయపడతాయి.

కొబ్బరి నూనె- ఆలివ్ నూనె మిశ్రమం

ఆలివ్ నూనెలోని మరమత్తు చేసే గుణాలు, కొబ్బరి నూనెలో హైడ్రేటింగ్ గుణాలు దెబ్బతిన్న, చిరిగిన జుట్టుకు చికిత్స చేసి మళ్లీ పునరుజ్జీవం తీసుకొస్తాయి. ఈ రెండు నూనెల కలయికతో పొడి జుట్టు, వికృతమైన జుట్టుకు సరైన పోషణ అందుతుంది, దువ్వుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ నూనెల కలయికతో ప్రయోజనకరమైన లక్షణాలతో జుట్టు షాఫ్ట్‌లను నింపడానికి హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ ఒక ప్రభావవంతమైన మార్గం, తద్వారా లోపలి నుండి జుట్టు యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది.

కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

ఎలా ఉపయోగించాలి:

  • ఒక గాజు గిన్నె తీసుకొని కొబ్బరి నూనె, ఆలివ్ నూనె కలిపి కనీసం పది సెకన్ల పాటు వేడి చేయండి.
  • ఈ మిశ్రమాన్ని జుట్టుకు వర్తించి 15 నిమిషాల పాటు తలకు మసాజ్ చేయండి
  • నూనె రాసుకున్న వెంట్రుకలపై వేడి టవల్‌ను చుట్టి సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి.
  • ఆ తర్వాత చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి, తలపై మిగిలిన నూనెను తొలగించడానికి సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి.

మెరుగైన ఫలితాల కోసం, వారానికి కనీసం రెండుసార్లు ఈ నూనెల కలయికతో మీ జుట్టుకు చికిత్స చేయండి.

DIY మిల్క్ స్ప్రే

పాలలో గొప్ప పోషకాలు ఉంటాయి, ఇవి జుట్టును బలోపేతంగా, మెరిసేలా చేస్తాయి. విటమిన్లు A, E, K, B-కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన విటమిన్లతో పాటు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు జుట్టు ఆకృతిని మెరుగుపరచడానికి, సిల్కీగా మార్చడానికి మిల్క్ స్ప్రే జుట్టుకి మంచి చికిత్స

ఎలా ఉపయోగించాలి:

  • ఆవిరితో శుభ్రపరిచిన హెయిర్ స్ప్రే బాటిల్‌ని తీసుకుని, అందులో దాదాపు నాలుగో వంతు పాలు పోయాలి.
  • జుట్టు పూర్తిగా సంతృప్తమయ్యే వరకు ఆ పాలను సమానంగా పిచికారీ చేయండి.
  • 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

పటిష్టమైన హెయిర్ షాఫ్ట్‌లు, ఫ్రిజ్ కంట్రోల్ , స్ట్రెయిట్ గా కనిపించడం కోసం ఈ మిల్క్ స్ప్రే ట్రీట్‌మెంట్‌ని వారానికి కనీసం రెండు సార్లు వర్తించండి.

DIY పద్ధతులను మీ రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల మీ జుట్టుకు లోపలి నుంచి మేలైన పోషణ లభిస్తుంది. జుట్టు నిటారుగా, సొగసుగా, ఆరోగ్యంగా మారుతుంది.