తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Basil Face Pack | తులసి ఆకులతో ముఖంలో సహజకాంతిని పొందండి.. ఇలా ఉపయోగించండి!

DIY Basil Face Pack | తులసి ఆకులతో ముఖంలో సహజకాంతిని పొందండి.. ఇలా ఉపయోగించండి!

HT Telugu Desk HT Telugu

02 March 2023, 9:57 IST

    • DIY Basil Face Pack: ముఖంపై మొటిమలు ఉన్నా, జిడ్డుగల చర్మమైనా అన్ని చర్మ సమస్యలను నివారించే ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులతో మీకు మీరుగా చేసుకోగలిగే కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు చూడండి.
DIY Basil Face Pack
DIY Basil Face Pack (Unsplash)

DIY Basil Face Pack

Skincare Routine: దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్క కనిపిస్తుంది. ఆయుర్వేదంపరంగా తులసి ఆకులు మొదలు కొని, దాని దళాలు, కొమ్మలు ఇలా మొక్కలోని ప్రతీభాగం మన ఆరోగ్యానికి అవసరమైనదే. తులసిలోని ఔషధ గుణాలు చర్మ సమస్యలను నివారించడానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ప్రకృతి వైద్యురాలు మీనాక్షి కౌశిక్ మాట్లాడుతూ.. తులసి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని జిడ్డుగల చర్మం కలవారికి ఇది దివ్యౌషధమని చెప్పారు. ముఖం నుండి అదనపు నూనె, మురికిని తొలగించడానికి తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అయితే సున్నితమైన చర్మం కలవారు మొదట చర్మంపై పరీక్షించిన తర్వాత మాత్రమే ముఖానికి వర్తించాల్సిదిగా సూచించారు.

ముఖంపై మొటిమలు మొదలుకొని, డార్క్ స్పాట్స్ తొలగించడం, చర్మాన్ని శుభ్రపరచడం, కాంతివంతంగా మార్చడం ఇలా అనేక చర్మ సమస్యలను తులసి పరిష్కరించగలదు. మీ రోజువారీ చర్మ సంరక్షణలో తులసిని ఉపయోగించాలనుకుంటే ఇక్కడ మీకు మీరుగా తయారు చేసుకోగల కొన్ని DIY సౌందర్య ఉత్పత్తుల గురించి తెలియజేస్తున్నాం. వీటిని మీ ఇంట్లో చేసుకొని ప్రయత్నించవచ్చు.

DIY Basil Scrub- తులసి స్క్రబ్

ఎనిమిది నుండి 10 తులసి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, ఆ తర్వాత మెత్తని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో రెండు చెంచాల ముల్తానీ మిట్టి కలపాలి.

ఈ చిక్కటి మిశ్రమంలో ఒక టీస్పూన్ తేనె, రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలు కలపండి.

ఇప్పుడు ఈ పేస్ట్‌ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి, స్క్రబ్‌గా ఉపయోగించండి.

DIY Basil Cleanser - తులసి స్కిన్ క్లెన్సర్

కొన్ని తులసి ఆకులను తీసుకొని, వాటిని పూర్తిగా ఎండబెట్టి, ఆపై మెత్తని పొడిని సిద్ధం చేయండి.

ఇప్పుడు ఒక చెంచా తులసి పొడిలో రెండు చెంచాల పెరుగు కలపాలి.

ఈ చిక్కటి పేస్ట్‌ని వేళ్ల సహాయంతో ముఖానికి పట్టించాలి.

ఇది కాకుండా, రోజ్మరీ ఆయిల్, రోజ్ వాటర్, తులసి పొడిని కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. దీనిని క్లెన్సర్‌గా ఉపయోగించండి

దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి తేలికగా బయటకు వస్తుంది.

DIY Basil Face Pack- తులసి ఫేస్ ప్యాక్

చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు టొమాటోలో ఉన్నాయి. దీని కోసం, రెండు టేబుల్ స్పూన్ల తులసి పొడిని టమోటా గుజ్జుతో అవసరం మేరకు కలపండి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల తేనె కలపండి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి 5 నుంచి 7 నిమిషాల్లో కడిగేయాలి. ఇది చర్మానికి మంచి పోషణనిస్తుంది, ముఖం మెరిసేలా చేస్తుంది.

DIY Basil Anti-Ageing Cream- తులసి యాంటీ ఏజింగ్ క్రీమ్

ముందుగా ఒక గిన్నెలో రెండు చెంచాల తులసి పొడిని తీసుకుని అందులో ఒక చెంచా బియ్యప్పిండిని కలపాలి.

ఇప్పుడు అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఆ పేస్టును ముఖానికి సర్క్యులర్ మోషన్ లో అప్లై చేయాలి.

మీరు ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు. దీని వాడకం వలన వదులుగా ఉన్న చర్మం బిగుతుగా మారడం ప్రారంభమవుతుంది. ముడతలు, ఇతర వృద్ధాప్య ఛాయలను దూరం చేయవచ్చు.