తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drumstick Buttermilk Curry । మునగకాయ మజ్జిగ కూర రుచికరం.. వేసవిలో తింటే ఎంతో ఆరోగ్యకరం!

Drumstick Buttermilk Curry । మునగకాయ మజ్జిగ కూర రుచికరం.. వేసవిలో తింటే ఎంతో ఆరోగ్యకరం!

HT Telugu Desk HT Telugu

12 April 2023, 13:31 IST

    • Drumstick Buttermilk Curry Recipe: వేసవిలో సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కడుపును చల్లగా, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇక్కడ సమ్మర్ స్పెషల్ మునగకాయ మజ్జిగ కూర రెసిపీ ఉంది చూడండి.
Drumstick Buttermilk Curry Recipe
Drumstick Buttermilk Curry Recipe (slurrp)

Drumstick Buttermilk Curry Recipe

Recipe of The Day: మునగకాయలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్, విటమిన్ సి వంటి పోషకాలకు గొప్ప శాకాహార వనరు. ఇంకా మునగకాయల్లో కాల్షియం, ఐరన్, ఇతర విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దృఢమైన ఎముకల నిర్మాణానికి, రక్తాన్ని శుద్ధి చేయడం కోసం, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కోసం మునగకాయలను ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. గర్భిణీ స్త్రీలు కూడా మునగకాయలు తినడం చాలా మంచిది.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఈ వేసవిలో మీరు చలువ గుణాలు కలిగిన, తేలికగా జీర్ణమయ్యే ఆహారం కోసం చూస్తుంటే మీకు ఇక్కడ ఒక రెసిపీని అందిస్తున్నాం. అదే మునక్కాడ మజ్జిగ చారు. పెరుగు, మజ్జిగ వంటివి ఎండాకాలంలో తప్పక తీసుకోవాలి. ఔషధ గుణాలు కలిగిన మునగాయలతో చేసే మునాక్కాడ మజ్జిగ కూరమీ భోజనంలో సంతృప్తికర వంటకం అవుతుంది. మునగకాయ మజ్జిగ కూర రెసిపీని ఇక్కడ చూడండి.

Drumstick Buttermilk Curry Recipe కోసం కావలసినవి

  • 1 మునగకాయ
  • 1/2 కప్పు పెరుగు
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 1/2 కప్పు తాజా కొబ్బరి తురుము
  • 1 టీస్పూన్ నానబెట్టిన బియ్యం
  • 1 టీస్పూన్ ధనియాలు
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 2 ఎండు మిరపకాయలు
  • 1 టీస్పూన్ నూనె
  • 1 టీస్పూన్ ఆవాలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • రుచికి తగినంత ఉప్పు

మునగకాయ మజ్జిగ కూర తయారీ విధానం

  1. ముందుగా మునగకాయ ముక్కలను ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని నీళ్లుపోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఆవిరి మీద ఉడికించండి.
  2. మరోవైపు, కొబ్బరి, నానబెట్టిన బియ్యం, జీలకర్ర, వేయించిన ధనియాలు, ఎర్ర మిరపకాయలను ఒక మిక్సర్ జార్ లోకి తీసుకొని, కొద్దిగా వేడి నీళ్లను కలిపి మెత్తని పేస్ట్‌గా రుబ్బుకోండి.
  3. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె పోసి, నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆపైన కరివేపాకు వేసి కలపండి.
  4. ఆపైన ఉడికించిన మునక్కాడ ముక్కలు, రుబ్బిన కొబ్బరి మిశ్రమం, పెరుగు లేదా మజ్జిగను వేసి, రుచి ప్రకారం ఉప్పు వేసి బాగా కలపండి.

అంతే, మునగకాయ మజ్జిగ కూర సిద్ధం. అన్నంలో కలుపుకొని తింటే అద్భుతం.

తదుపరి వ్యాసం