Mutton Mushroom Recipe । మటన్ పుట్టగొడుగుల కూర.. దీని టేస్ట్ అద్భుతహ!
Mutton Mushroom Recipe: మటన్ ముక్కలు, పుట్టగొడుగులు కలిపి వండిన కూర ఎంతో రుచిగా ఉంటుంది, ఇది శక్తివంతమైన ఆహారం కూడా మటన్ మష్రూమ్ కూర రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Ramadan Recipes: పుట్టగొడుగులు (Edible Mushrooms) రుచికరమైనవి మాత్రమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ ఉంటాయి. పుట్టగొడుగుల్లో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. వీటిని చాలా రకాలుగా వండుకోవచ్చు, అంతేకాకుండా పుట్టగొడుగులను మాంసం కూరలతో కూడా మిక్స్ చేయవచ్చు. మాంసం, పుట్టగొడుగులతో కలిపి వండిన కూర ఎంతో పోషకభరితంగా ఉంటుంది, మంచి శక్తిని కూడా అందిస్తుంది.
రంజాన్ మాసంలో రుచికరమైన, శక్తివంతమైన ఆహారం కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రముఖ చెఫ్ లు వండిన మటన్ మష్రూమ్ కర్రీ రెసిపీని అందిస్తున్నాం. ఇది ఇఫ్తార్ విందులో ఆస్వాదించడానికి అద్భుతంగా ఉంటుంది.
Mutton Mushroom Curry Recipe కోసం కావలసినవి
- 500 గ్రాముల బోన్‌లెస్ మటన్
- 12-15 బటన్ మష్రూమ్ ముక్కలు
- 2 టమోటాలు
- 2 ఉల్లిపాయలు
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 4 పచ్చిమిర్చి
- 1 టీస్పూన్ అల్లం తురుము
- 1 టీస్పూన్ వెల్లుల్లి తురుము
- 1 పెద్ద బంగాళాదుంప
- 1/2 టీస్పూన్ పసుపు
- 2 టీస్పూన్లు ధనియాల పొడి
- 3 టీస్పూన్లు కారం
- 2 టీస్పూన్లు గరం మసాలా పొడి
- 1 టీస్పూన్ గోధుమ పిండి
- రుచికి తగినంత ఉప్పు
మటన్ మష్రూమ్ కూర తయారీ విధానం
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి సగానికి నిలువుగా కట్ చేసుకోండి. మటన్ కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు ఉండేలా కట్ చేసుకోండి. ఆపైన కూరగాయలు శుభ్రంగా కడిగి, పొట్టు తీయడం, ముక్కలుగా కట్ చేయడం చేసుకోండి.
- ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేయండి. మొదట ఉల్లిపాయలు వేసి వేయించాలి.
- ఆ తర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు మటన్ ముక్కలు వేసి, బాగా మిక్స్ చేసి ఎక్కువ మంట మీద ఉడికిస్తూ ఉండాలి.
- ఈ దశలో బంగాళాదుంప ముక్కలు, పసుపు పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.
- అనంతరం పుట్టగొడుగులు, టమోటాలు, 2 కప్పుల నీరు వేసి బాగా కలపాలి. ఉప్పు, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోండి. అందులో నీరు పోసి మెత్తని ముద్దగా కలపాలి. ఈ పిండి ముద్దను కూడా మటన్ కుక్కర్‌లో వేసి బాగా కలపాలి.
- అనంతరం కుక్కర్ మూతపెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు లేదా మటన్ పూర్తిగా ఉడికే వరకు ఆవిరి మీద ఉడికించాలి.
ఆ తర్వాత మూత తెరిచి చూస్తే, ఘుమఘుమలాడే మటన్ మష్రూమ్ కూర రెడీ. అన్నంతో గానీ, చపాతీతో గానీ తింటూ రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం