Anti-ageing Mushrooms । ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే.. పుట్టగొడుగులు తినాలట!-eating mushrooms could help you to get youthful looking skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anti-ageing Mushrooms । ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే.. పుట్టగొడుగులు తినాలట!

Anti-ageing Mushrooms । ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే.. పుట్టగొడుగులు తినాలట!

HT Telugu Desk HT Telugu
Jan 15, 2023 12:17 PM IST

Mushrooms for Youthful Look: పుట్టగొడుగులు తింటే వృద్ధాప్యాన్ని దూరంచేసుకొని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉందవచ్చునని పరిశోధనలు పేర్కొన్నాయి, ఎలాంటి రకం పుట్టగొడుగులు తినాలో చూడండి.

Mushrooms for Youthful Look
Mushrooms for Youthful Look (Unsplash)

ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే పుట్టగొడుగులు తినండి. అవును మీరు చదివింది నిజమే, పుట్టగొడుగులు తినడం ద్వారా అందులోని పోషకాలు చర్మాన్ని యవ్వనంగా మార్చగలవని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ, గడిచే ప్రతి ఏడాది మనల్ని వృద్ధాప్యానికి చేరువ చేస్తుంది. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం వలన ఈ వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చు.

ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు, సమృద్ధిగా నీరు తీసుకోవడం వలన అవి వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇలాంటి పోషకాలు కొన్ని రకాల పుట్టగొడుగులలో పుష్కలంగా లభిస్తాయని వారి నివేదికలలో పేర్కొన్నారు.

యూఎస్‌లోని పెన్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, యాంటీ-ఏజింగ్ గుణాలు కలిగిన ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్‌ సమ్మేళనాలు పుట్టగొడుగులలో అత్యధికంగా బయటపడ్డాయి. ఆ పుట్టగొడుగులను ఉడికించడం ద్వారా కూడా ఎర్గోథియోనిన్ సమ్మేళనాలు విచ్ఛిన్నం కాలేదు, అవి చాలా వేడిని కూడా తట్టుకునేలా ఉన్నాయి. అలాంటి పుట్టగొడుగులను రోజూ తినడం వలన వృద్ధాప్య సమస్యలతో పోరాడవచ్చని పరిశోధన వెల్లడించింది.

Mushrooms for Youthful Look - ఎలాంటి పుట్టగొడుగులు తినాలి?

పుట్టగొడులలో చాలా రకాలు విషపూరితమైనవే ఉంటాయి, తెలియకుండా అలాంటి వాటిని తింటే ప్రాణాలకే ప్రమాదం. పుట్టగొడుగులలో కొన్ని రకాలు మాత్రమే తినదగినవిగా గుర్తింపు పొందాయి. అలాంటి రకాలు తినడం వలన పోషకాలు లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. పరిశోధకులు మొత్తంగా 13 రకాల పుట్టగొడుగులపై పరిశోధనలు జరపగా అందులో కేవలం 2-3 రకాలలో మాత్రమే వృద్ధాప్యాన్ని దూరం చేసే పోషకాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆ పుట్టగొడుగుల రకాలు (Anti-ageing Mushrooms) ఏమిటో ఇక్కడ చూడండి.

పోర్సిని పుట్టగొడుగులు - Porcini Mushrooms

వృద్ధాప్య నిరోధక పోషకాల కోసం పోర్సిని రకం పుట్టగొడుగులను ఎంచుకోవడానికి ఉత్తమమని అధ్యయనం ఎత్తి చూపింది. ఇవి పొడి చర్మం, చర్మంపై ముడతలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నయం చేసే పోషకాలను కలిగి ఉంటాయి. వాతావరణ ప్రభావాలతో దెబ్బతినే చర్మం, జుట్టు సంరక్షణకు ఈ పుట్టగొడుగులలోని పోషకాలు మంచి పోషణ అందిస్తాయి, లోపలి నుంచి మాశ్చరైజింగ్ అందించడంలో ఈ పోర్సిని రకం పుట్టగొడుగులు అమూల్యమైనవి.

రీషి, చాగా పుట్టగొడుగులు- Reishi, Chaga Mushrooms

రీషి, చాగా పుట్టగొడుగులు వంటి కొన్ని ఇతర రకాల పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొడి చర్మం, నిర్జలీకరణ చర్మం, వృద్ధాప్య సంకేతాలు వంటి సమస్యలను ఎదుర్కోవటంలో వీటిలోని పోషకాలు తోడ్పడతాయి. ఇందులో రీషి రకం పుట్టగొడుగులలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించే దాని బీటా-గ్లూకాన్స్, చక్కెర అణువులను కలిగి ఉన్నాయి. ముడతలను నివారించడంలో వీటిని 'సూపర్ ఫంగస్' లుగా వర్గీకరించారు.

చాంటెరెల్స్, బటన్ పుట్టగొడుగులు - Chanterelles, Button Mushrooms

చాంటెరెల్స్, వైట్ బటన్స్ వంటి పుట్టగొడుగు రకాలను ఇప్పటికే పలు సౌందర్య ఉత్పత్తులలో పదార్థాలుగా వినియోగిస్తున్నారు. చాంటెరెల్ పుట్టగొడుగులలో విటమిన్లు, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి, పోషణ అందిస్తాయి, రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు ఇవి ఈ రకం కీలకం. బటన్ పుట్టగొడుగులు మనకు విరివిగా లభించే రకం, ఇందులోనూ అనేక పోషకాలు ఉన్నాయి.

WhatsApp channel