Skin Care Tips: మీతో మీరే ప్రేమలో పడండి, నవయవ్వనపు చర్మాన్ని ఇలా సొంతం చేసుకోండి-fall in love with yourself make these changes to your skincare routine ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Fall In Love With Yourself, Make These Changes To Your Skincare Routine

Skin Care Tips: మీతో మీరే ప్రేమలో పడండి, నవయవ్వనపు చర్మాన్ని ఇలా సొంతం చేసుకోండి

Manda Vikas HT Telugu
Feb 28, 2022 05:53 PM IST

అందరి చర్మం ఒకేలా ఉండదు. కొందరిది జిడ్డుగా ఉంటే, ఇంకొందరిది పొడిగా ఉంటుంది లేదా నార్మల్ స్కిన్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఎవరి చర్మ రకం ఎలాంటిదో తెలుసుకొని దానికి తగినట్లుగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.

Skin Care
Skin Care (Shutterstock)

ఎప్పుడూ అందంగా, నవయవ్వనంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? అన్నింటికంటే ముందుగా మీతో మీరే ప్రేమలో పడండి. మిమ్మల్ని మీరు కేరింగ్‌గా చూసుకోండి. మీ చర్మాన్ని కూడా ప్రేమించండి. ఇది మీ డైలీ రొటీన్‌గా ఉండాలి. మీ ముఖంలో కళ పెరగాలంటే కూడా అందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. 

మీకు తెలిసే ఉంటుంది అందరి చర్మ రకం ఒకేలా ఉండదు. కొందరిది జిడ్డుగా ఉంటే, ఇంకొందరిది పొడిగా ఉంటుంది లేదా నార్మల్ స్కిన్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఎవరి చర్మ రకం ఎలాంటిదో తెలుసుకొని దానికి తగినట్లుగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఎలాంటి చర్మం గల వారు ఏ రకమైన శ్రద్ధ తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుందో ఒక్కడ ఇచ్చాం. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.

ఆయిలీ స్కిన్:  

జిడ్డుగల చర్మం సాధారణంగా మొటిమలకు గురవుతుంది. ఈ చర్మ గ్రంథుల్లో సెబమ్ అనే ఒకరమైన నూనెలాంటి పదార్థం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆయిల్ స్కిన్‌లో బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. అందువల్ల అది మొటిమలు సంభవించడానికి అవకాశం ఇస్తుంది. దీనిని పట్టించుకోకపోతే అది వైట్ హెడ్స్ , బ్లాక్ హెడ్స్ సమస్యకు దారితీస్తుంది.

కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఆస్ట్రిజెంట్ టోనర్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ టోనర్ ఇంట్లో ఉండే తయారు చేసుకోవచ్చు.

ఎలా అంటే.. బ్లాక్ టీని సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. అనంతరం దీనిలో ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, హాజెల్ వాటర్ కలపాలి. ఇది ఒక టోనర్ లాగానే చర్మంపై పనిచేస్తుంది. ఈ ద్రావణాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని అప్పుడప్పుడు ఆయిలీ స్కిన్ పై అప్లై చేస్తూ ఉండాలి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మంపై పేరుకుపోయిన క్రిములను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొడి చర్మం: 

ఇలాంటి రకం చర్మంలో ఆయిల్ ఉత్పత్తి అనేది జరగదు కాబట్టి చాలా డ్రైగా కనిపిస్తుంది. మాయిశ్చర్ అనేదే ఉండదు. జిడ్డుగల చర్మంతో పోలిస్తే పొడి చర్మం త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తమ చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. వీరు ఫ్రూట్ మాస్క్ లాంటివి ఫేసియల్స్ గా ఉపయోగించవచ్చు.

ఇంట్లోనే ఫ్రూట్ మాస్క్ మీకు మీరుగా ఇలా చేసుకోండి: 

పండిన అరటిపండు, మస్క్ మిలన్ రెండు సమపాళ్లలో తీసుకొని మెత్తని ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి అర చెంచా నిమ్మరసం, ఒక చెంచా ఓట్స్ కలిపి బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టును ముఖానికి, మెడకు అప్లై చేసుకొని సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇది మీ పొడిబారిన ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. పొడి చర్మం కలవారు బయటకు వెళ్లేటపుడు తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.

నార్మల్ స్కిన్: 

ఇలాంటి చర్మ రకంలో నూనె, నీరు రెండింటి సమతుల్యత ఉంటుంది.  కాబట్టి ఇలాంటి స్కిన్ కలిగిన వారు వారి చర్మాన్ని ఎప్పుడూ అలాగే ఉండేలా సంరక్షించుకోవాలి. కఠినమైన కాస్మొటెక్స్ లాంటివి వాడకూడదు. తరచుగా నీటితో ముఖం కడుక్కోవాలి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. బయటికి వెళ్లేటపుడు సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. వారి ముఖానికి విటమిన్-సి ఆధారిత బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చు.

కాంబినేషన్ స్కిన్: 

పొడిగానూ ఉంటుంది, జిడ్డుగానూ ఉంటుంది. ఈ కాంబినేషన్ చర్మం కలవారికి మృదువైన గుణాలు కలిగిన టోనర్ అనువైనది. దీనికోసం టోనర్ కూడా ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు.

ఇది ఎలా అంటే.. ఒక పావులీటర్ నీటిని మరిగించి, ఈ నీటిని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇప్పుడు గాజుసీసాలోని ఈ మరిగించిన నీటిలోనే కొన్ని గులాబీ పూల రెమ్మలు, కొన్ని రోస్మరి ఆకులు లేదా తులసి ఆకులు, కొన్ని మురిపిండ లేదా కుప్పింటాకులు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి మూతపెట్టి ఒక రాత్రి అంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ ద్రావణాన్ని ఒక గ్లాస్ బాటిల్‌లోకి వడకట్టినపుడు ఏర్పడిన ఆ ద్రావణం టోనర్ లాగా పనిచేస్తుంది. రోజుకు రెండు సార్లు ఈ టోనర్ అప్లై చేసుకుంటే ఫలితాలుంటాయి.

 

WhatsApp channel

సంబంధిత కథనం