తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Upma Recipe। ప్రోటీన్లతో నిండిన బ్రేక్‌ఫాస్ట్‌.. పనీర్ ఉప్మా రుచిలోనూ బెస్ట్!

Paneer Upma Recipe। ప్రోటీన్లతో నిండిన బ్రేక్‌ఫాస్ట్‌.. పనీర్ ఉప్మా రుచిలోనూ బెస్ట్!

HT Telugu Desk HT Telugu

02 October 2022, 8:32 IST

    • ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో పనీర్ ఉప్మా చేసుకోండి. ఇది ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ప్రోటీన్లతో నిండిన ఆహారం కాబట్టి బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. Paneer Upma Recipe కోసం ఇక్కడ చూడండి.
Upma
Upma (Slurrp)

Upma

రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకుంటే ఉప్మా బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఉప్మాను అనేక రకాలుగా చేసుకోవచ్చు. మనం ఉపయోగించే పదార్థాలను బట్టి ఉప్మాకు ఆ రుచి, ఫ్లేవర్ వస్తాయి. కొద్దిగా ట్యాంగీ టేస్ట్ కావాలనుకుంటే టొమాటోలు వేసుకోవచ్చు. లేదా కూరగాయలు కలుపుకొని వెజిటెబుల్ ఉప్మా చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

Foundation Side effects: ప్రతిరోజూ ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే జరిగేది ఇదే

ఉప్మాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, తక్కువ నూనెను ఉపయోగిస్తాము. ఇందులో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, జీర్ణం అవటానికి సమయం పడుతుంది కాబట్టి చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గటంలోనూ ఉపయోగపడుతుంది. మీరు బరువు తగ్గే ప్రయత్నంలో ఉంటే ఉప్మాలో కాస్త వెరైటీగా పనీర్ ఉప్మాను చేసుకోవచ్చు.

పనీర్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం. కాబట్టి పనీర్ ఉప్మా మీకు మంచి ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ (Protein Packed Breakfast) అవుతుంది. ఎంతో రుచికరంగానూ ఉంటుంది. నూనెకు బదులు నెయ్యివాడితే కేలరీలు మరింత తగ్గుతాయి, ఘుమఘుమ సువాసనతో ఈ పనీర్ ఉప్మా మీ నోరు ఊరిస్తుంది. మరి ఇంకా ఊరించకుండా ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ అయినటువంటి పనీర్ ఉప్మా తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు ఏమిటి, తయారు చేసుకునే విధానం ఎలానో ఇక్కడ చూసేయండి. ఈ సింపుల్ రెసిపీని మీరు 10-15 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.

Paneer Upma Recipe కోసం కావలసినవి:

  • 160 గ్రాముల ఉప్మా రవ్వ
  • అరకప్పు పనీర్ క్యూబ్స్
  • 4 టేబుల్ స్పూన్ నెయ్యి
  • 1 టీస్పూన్ ఆవాలు
  • 1 టీస్పూన్ శనగపప్పు
  • 1 టీస్పూన్ బెంగాల్ శెనగపప్పు
  • 1 ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి ముక్కలు,
  • 5-6 కరివేపాకులు
  • 1 టీస్పూన్ పోపు గింజలు
  • అరలీటర్ వేడి నీరు
  • ఉప్పు తగినంత

పనీర్ ఉప్మా తయారీ విధానం

  1. ముందుగా పాన్‌లో కొద్దిగా నెయ్యిలో వేడి చేసి, అందులో పనీర్‌ను వేయించండి, దీనిని పక్కనపెట్టుకోండి.
  2. ఇప్పుడు అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేడిచేసి, ఆవాలు, శనగపప్పుతో పాటు ఇతర పోపు గింజలను వేయించండి.
  3. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  4. ఉల్లిపాయలు పారదర్శకంగా మారడం ప్రారంభించినప్పుడు అందులో రవ్వ వేసి బాగా వేయించాలి.
  5. వేయించిన రవ్వలో వేడినీరు, ఉప్పు వేసి కలుపుతూ ఉండండి.
  6. ఉప్మా చిక్కగా మంచి రూపం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన పనీర్ చల్లుకోవాలి
  7. కొత్తిమీర ఆకుల గార్నిష్‌ చేసుకుంటే పనీర్ ఉప్మా రెడీ.

ఈ పనీర్ ఉప్మా మంచి ప్రోటీన్ కలిగిన అల్పాహారం. రుచికరంగా ఉంటుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది. దీనిని మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కోసం, లేదా సాయంత్రం అల్పాహారంగానైనా తీసుకోవచ్చు.

టాపిక్