తెలుగు న్యూస్  /  Lifestyle  /  Indian Coast Guard Recruitment 2022 Last Date Soon To Apply For Assistant Commandant Posts

Indian Coast Guard Recruitment 2022 : 71 పోస్టులకు ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ

01 September 2022, 9:07 IST

    • Indian Coast Guard Recruitment 2022 : ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022 అసిస్టెంట్ కమాండెంట్, ఇతర పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది. అర్హత కలిగిన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022

Indian Coast Guard Recruitment 2022 : ఇండియన్ కోస్ట్ గార్డ్ 71 అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ, CPL, టెక్నికల్ (మెకానికల్, ఎలక్ట్రికల్), లా ఖాళీల పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను త్వరలో ముగించనుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 07, 2022. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీ 2022 వివరాలు

జనరల్ డ్యూటీ (GD) / (పైలట్/నావిగేటర్), కమర్షియల్ పైలట్ లైసెన్స్ (SSA): 50 పోస్టులు

* పే స్కేల్: 56100/- లెవెల్ -10

* టెక్నికల్ (మెకానికల్ & ఎలక్ట్రికల్): 20 పోస్టులు

* లా: 01 పోస్ట్

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022 అర్హత ప్రమాణాలు

* జనరల్ డ్యూటీ/(పైలట్/నావిగేటర్): అభ్యర్థి కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గణితం, ఫిజిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 10+2+3 విద్యా పథకంలో ఇంటర్మీడియట్ లేదా XII తరగతి వరకు లేదా 60% కలిగి ఉండాలి. దానిలో కచ్చితంగా గణితం, భౌతికశాస్త్రం ఉండాలి.

* CPL-SSA: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ద్వారా జారీ చేసిన/ ధృవీకరించిన ప్రస్తుత / చెల్లుబాటు అయ్యే కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కలిగి ఉన్న అభ్యర్థులు. కనీస విద్యార్హత - మొత్తం 60% మార్కులతో XIIth ఉత్తీర్ణత (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్).

* టెక్నికల్ (మెకానికల్): అభ్యర్థి తప్పనిసరిగా నావల్ ఆర్కిటెక్చర్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకాట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ లేదా డిజైన్ లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్‌లో కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి.

* టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): అభ్యర్థి కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుం;f ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి.

* లా ఎంట్రీ: కనీసం 60% మొత్తం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ.

* దరఖాస్తు రుసుము: నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI ద్వారా పరీక్ష రుసుమును చెల్లించవచ్చు.

* Gen/OBC/EWS కోసం: 250/-

* SC/ST కోసం: రుసుము లేదు

* ఇండియన్ కోస్ట్ గార్డ్ AC ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎంపిక (మెంటల్ ఎబిలిటీ టెస్ట్/ కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్) & ఫైనల్ సెలక్షన్ (సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

టాపిక్