తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Water Deficiency : మండే వేసవిలో శరీరంలోని నీటి కొరతను ఈ పండ్లు భర్తీచేస్తాయి

Water Deficiency : మండే వేసవిలో శరీరంలోని నీటి కొరతను ఈ పండ్లు భర్తీచేస్తాయి

Anand Sai HT Telugu

28 April 2024, 12:30 IST

    • Water Deficiency : వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది.
వేసవిలో తినాల్సిన పండ్లు
వేసవిలో తినాల్సిన పండ్లు (Unsplash)

వేసవిలో తినాల్సిన పండ్లు

ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడితో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అయితే ఇది మామూలే. ఎందుకంటే ఈ సమయంలో శరీరానికి చెమట పట్టడానికి చాలా నీరు అవసరం. ఆ లోపాన్ని తీర్చకపోతే డీహైడ్రేషన్ సంభవించవచ్చు. కానీ వేడి కారణంగానే కాదు, విరేచనాలు, వాంతులు, జ్వరం మొదలైన వాటి వల్ల కూడా శరీరంలో నీటి లోపం సంభవించవచ్చు. అందుకే సరిపోయేంత నీరు తాగాలి.

ట్రెండింగ్ వార్తలు

Breathing Cancer With Car : కారులోని కెమికల్స్ ద్వారా బ్రీతింగ్ క్యాన్సర్.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

Shawarma Food Poison: షావర్మా తిని ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు ఎందుకు? ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు ఎందుకు గురవుతోంది?

Mothers Day 2024 : మీ తల్లికి 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉందా? ఆమెలో ఈ మార్పులు గమనించారా?

Gongura Enduroyyalu: గోంగూర ఎండు రొయ్యలు ఒక్కసారి వండి చూడండి, ఆ రుచి నీకు నచ్చడం ఖాయం

శరీరంలో నీటి లోపం వల్ల నీటితోపాటు మినరల్స్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నీటిని తాగడంతోపాటుగా పండ్లు తీసుకోవడం మంచిది. పొటాషియం లోపాన్ని భర్తీ చేయడానికి పండిన అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం మంచి పద్ధతి. అయితే వేసవిలో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. అధిక కెఫిన్ శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. వేసవిలో కాఫీ, నూనెలో వేయించిన ఆహారాన్ని నివారించండి. కానీ మీ శరీరంలో నీటి లోపాన్ని తగ్గించే అనేక పండ్లు ఉన్నాయి.

నిమ్మరసం

వేసవికాలం అంటే మనం నిమ్మరసం తాగడం చాలా ఇష్టం. ఈ వేసవిలో నిమ్మకాయ కంటే ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది మీరే చెప్పండి. విటమిన్ సి ఉన్న ఈ పండ్ల రసం మిమ్మల్ని రోజంతా రిఫ్రెష్ గా ఉంచుతుంది. కానీ నిమ్మకాయ సిరప్‌లో ఎక్కువ చక్కెరను జోడించవద్దు. నిమ్మకాయలోని పొటాషియం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చెమట పట్టడం వల్ల శరీరంలో ఏర్పడే మినరల్ లోపాన్ని చాలా వరకు నిమ్మకాయ పూరిస్తుంది. నిమ్మకాయల్లో 88 శాతం నీరు ఉంటుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ ప్రాథమికంగా వేసవి పండు. పుచ్చకాయను మార్కెట్‌లో దొరుకుతాయి. వేసవిలో కాస్త ఉపశమనం పొందాలంటే ఈ పండును తినవచ్చు. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. పుచ్చకాయలో 90శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఇది ప్రయోజనకరమైన ఆహారం. ఇందులో ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఇది తీవ్రమైన వేడిలో కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మామిడి

మామిడి.. పండ్లలో రారాజు. బహుళ పోషకాలతో నిండిన ఈ పండు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో చాలా కేలరీలు ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఫైబర్, సోడియం, 20 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. మామిడి పండ్లను క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం మొదలైన వాటిని నివారించడానికి కూడా సహాయపడుతుంది. మామిడిలో 88 శాతం నీరు ఉంటుంది.

టొమాటోలు

టొమాటోలు సులభంగా దొరుకుతాయి. టొమాటోలు మీ ఆరోగ్యానికి మంచివి వండి లేదా పచ్చిగా తినవచ్చు. కానీ మీరు పచ్చిగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. టొమాటో సలాడ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి, క్రోమియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఫైటోకెమికల్స్ ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. టొమాటోలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

దోసకాయ

వేసవికి మరో బెస్ట్ ఫ్రూట్ దోసకాయ. ఇది డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దోసకాయలో విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. దోసకాయలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. ఈ పండు అత్యంత ప్రయోజనకరమైన లక్షణం ఏమిటంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇది డిటాక్స్‌గా కూడా బాగా పనిచేస్తుంది. దోసకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచుతుంది. దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది.

తదుపరి వ్యాసం