ప్రతీ రోజు నిమ్మరసం తాగడం వల్ల దక్కే ప్రయోజనాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 24, 2024

Hindustan Times
Telugu

నిమ్మరసంలో విటమిన్ సీ, బీ, ఫోలెట్, యాంటీఆక్సిడెంట్లు పొటాషియమ్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుకే నీటిలో నిమ్మరసం వేసుకొని తాగడం చాలా మేలు. ఇలా ప్రతీ రోజు నిమ్మరసం తాగడం వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే. 

Photo: Pexels

ప్రతీ రోజు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. నిమ్మలోని చాలా పోషకాల వల్ల జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. 

Photo: Pexels

నిమ్మరసంలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ప్రతీ రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని రకాల వ్యాధుల నివారణకు నిమ్మరసం తోడ్పడుతుంది. 

Photo: Pexels

నిమ్మరసం రెగ్యులర్‌గా తాగడం వల్ల చర్మపు మెరుపు పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. అందుకే వేసవిలో నిమ్మరసం డైలీ తాగితే చర్మానికి మేలు జరుగుతుంది.

Photo: Pexels

నిమ్మరసంలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని రోజూ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే, రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. 

Photo: Pexels

నిమ్మరసం శరీరానికి శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు వల్ల ఈ ప్రయోజనం దక్కుతుంది. బరువు తగ్గేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది.

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels