AAI Recruitment 2022: AAIలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు మంచి అవకాశం!
29 August 2022, 15:07 IST
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు భర్తీ చేసుకోవచ్చు.
AAI Recruitment 2022
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ల నుండి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కొరుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మెుత్తం 156 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 12వ తరగతి నుంచి మాస్టర్ స్థాయి వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌లు సెప్టెంబర్ 1న aai.aero/en/careers/recruitmentలో విడుదల చేయబడతాయి.
పోస్టుల వివరాలు
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 132 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 10 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్): 13 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష): 1 పోస్ట్
ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
వయో పరిమితి
ఈ పోస్టులకు అభ్యర్థుల వయస్సు ఆగస్టు 25 నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
విద్యార్హత సంబంధించిన వివరాల కోసం ఇక్కడ నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.
జీతం
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): రూ 31000-92000
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): రూ 31000-92000
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్): రూ 36000-110000
సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష): రూ 36000-110000
దరఖాస్తు రుసుము
ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,000 ఉండగా.. AAIలో సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు/SC/ST/X-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, వికలాంగులు, ట్రైనీలు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.