AP Govt Jobs Notification 2022 : పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. రూ.లక్ష వరకు జీతం
16 August 2022, 19:31 IST
- రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేసేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
351 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల సంఖ్య కింది విధంగా ఉంది.
గైనకాలజీ-60, అనస్థీషియా- 60, పీడియాట్రిక్స్-51, జనరల్ మెడిసిన్-75, జనరల్ సర్జరీ-57, రేడియాలజీ-27, పాథాలజీ-9, ENT-9, ఫోరెన్సిక్ మెడిసిన్‌లో 3 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అర్హత: పీజీ/డిప్లొమా/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు మించకూడదు.
అకడమిక్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులకు నెలవారీ వేతనం రూ.61,960 నుంచి రూ.1,51,370 చెల్లిస్తారు. జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC/ST/BC/PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఆగస్టు 26, 2022 రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.