AAI jobs: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
AAI వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కొరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు AAI అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మెుత్తం ఖాళీల సంఖ్య 18. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు AAI అధికారిక సైట్‌ను aai.aero సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 29 జూలై 2022.
పోస్ట్, ఖాళీలు & అర్హతలు
సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) - 3 పోస్టులు.
గ్రాడ్యుయేషన్ తో పాటు LMV లైసెన్స్. మరియు రెండేళ్ల సంబంధిత ఫీల్డ్ లో అనుభవం ఉండాలి .
సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ - 2 పోస్టులు.
బి.కామ్‌లో గ్రాడ్యుయేషన్. మూడు నుండి 6 సంవత్సరాల అనుభవం.
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) - 9 పోస్టులు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / రేడియో ఇంజినీర్. రెండు సంవత్సరాల అనుభవం.
సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) - 2 పోస్టులు.
ఇంగ్లీష్ ,హిందీ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్. లేదా
ఆంగ్లం, హిందీ సబ్జెక్టుతో మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ - 2 పోస్టులు.
గ్రాడ్యుయేషన్‌తో పాటు టైపింగ్‌లో పరిజ్ఞానం. నిమిషానికి 30 పదాల వేగంతో ఇంగ్లీష్ టైపింగ్ లేదా నిమిషానికి 25 పదాల వేగంతో హిందీ టైపింగ్.
అన్ని పోస్టులకు గరిష్ట వయో పరిమితి - 30 సంవత్సరాలు. 30 ఏప్రిల్ 2022 నుండి లెక్కించబడుతుంది. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
పే స్కేల్
సీనియర్ అసిస్టెంట్ - 36000-3%- 110000
జూనియర్ అసిస్టెంట్ - 31000 - 3%- 92000
దరఖాస్తు రుసుము
జనరల్ కేటగిరీ, EWS - రూ 1000
SC, ST, మహిళలు, దివ్యాంగులకు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు.
AAIలో ఒక సంవత్సరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అప్రెంటీస్‌లకు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
కోవిడ్-19 సంబంధించి నిర్ణీత రుసుము కింద రూ. 90 చెల్లించాలి.