తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lungs Clean Drink : పొగ తాగేవారు.. ఊపిరితిత్తులను ఇలా క్లీన్ చేసుకోండి!

Lungs Clean Drink : పొగ తాగేవారు.. ఊపిరితిత్తులను ఇలా క్లీన్ చేసుకోండి!

Anand Sai HT Telugu

29 April 2023, 15:30 IST

    • Lungs Cleans Drink : పొగతాగడం చాలా మందికి ఉన్న అలవాటు. దీనితో అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల మీద చాలా ప్రభావం ఉంటుంది. వీలైనంత త్వరగా మానేయాలి. అయితే ఓ డ్రింక్ తాగి.. మీ ఊపిరితిత్తులను క్లీన్ చేసుకోవచ్చు.
ఊపిరితిత్తులను క్లీన్ చేసే డ్రింక్
ఊపిరితిత్తులను క్లీన్ చేసే డ్రింక్

ఊపిరితిత్తులను క్లీన్ చేసే డ్రింక్

మానవ శరీరంలో నిరంతరం పని చేసే ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు(Lungs) కూడా ఉన్నాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ చాలా మంది పొగ(Smoking) తాగుతూ.. ఊపిరితిత్తులను ప్రమాదంలో పడేస్తున్నారు. ధూమపానం వదల్లేక.. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. పొగ తాగితే.. ఊపిరితిత్తులతోపాటుగా చర్మం(Skin), జుట్టు, మెదడుపై ప్రభావం పడుతుంది.

పొగాకులో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు(Mind)పై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది రక్తంలో, మెదడు మూలాల్లో పూర్తిగా కలిసిపోతుంది. ఈ కారణంగా శరీరం(Body)లో నికోటిన్ శాతం తక్కువ అవ్వగానే.. మెదడు ధూమపానం చేయాలనే కోరికను కలిగిస్తుంది. వెంటనే వెళ్లి.. రెండు మూడు సిగరేట్లు పీల్చేస్తారు. ఒక్క సిగరేట్(Cigarette) తాగితే.. వేల సంఖ్యలో రసాయనాలు బయటకు వస్తాయి. ఇందులో 400 పైగా విషపూరితమైనవి, 43కు పైగా రసాయనాలు క్యాన్సర్ కలిగిస్తాయి.

రక్తం(Blood) కూడా కలుషితం అవుతుంది. శరీరం మెుత్తం దెబ్బతింటుంది. అందుకే ధూమపానం చేయడం చాలా ప్రమాదకరం. లైంగిక సమస్యలు, ఆకలి తగ్గడం.. ఇలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఇక ధూమపానంతో ఊపిరితిత్తులు ఎంతగానో డ్యామేజ్ అవుతాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా(Lungs Health) ఉంచుకోవాలి. అందుకోసం ఓ చిట్కా ఉంది. ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు.

ఈ చిట్కాతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు. పేరుకుపోయిన మ‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది. ఆ చిట్కా చేసందుకు కావాల్సినవి ఇంట్లోనే ఉన్నాయి. అవేంటంటే.. అల్లం రసం, దాల్చిన చెక్క పొడి, నిమ్మకాయ రసం, తేనె, కాయన్ పెప్పర్ పౌడర్ ఉపయోగించాలి.

ఓ గిన్నెలో గ్లాసు నీటినిపోసి బాగా వేడి చేయాలి. తర్వాత గ్లాసులోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పావు టేబుల్ స్పూన్ కాయన్ పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్ నిమ్మరం వేసి కలపాలి.

ఇలా తయారు చేసిన పానీయాన్ని రోజు రాత్రి నిద్రపోయేముందు టీ తాగినట్టుగా కొద్ది కొద్దిగా తాగాలి. ఇలా చేస్తే.. ధూమపానం(Smoking) వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మలినాలు తొలగిపోతాయి. శ్వాస వ్యవస్థలో మంచి మార్పు కనిపిస్తుంది. ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు... ఈ చిట్కాను పాటించొచ్చని నిపుణులు అంటున్నారు.