kidney health: వేసవిలో కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోండిలా.. ఈ తప్పులు చేయకండి-precautions to take in summer for kidney health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Health: వేసవిలో కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోండిలా.. ఈ తప్పులు చేయకండి

kidney health: వేసవిలో కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోండిలా.. ఈ తప్పులు చేయకండి

Parmita Uniyal HT Telugu
Apr 28, 2023 08:00 AM IST

kidney health: వేసవి కాలంలో కిడ్నీలను ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యం గురించి కొన్ని నిపుణుల సలహాలు తెలుసుకోండి.

వేసవిలో కిడ్నీ ఆరోగ్యం
వేసవిలో కిడ్నీ ఆరోగ్యం (Shutterstock)

వేసవి రాగానే నీళ్లు సరిపోయేన్ని తాగుతున్నామా లేదా? కిడ్నీలకు ఏమైనా అయిపోతుందా.. ఇంకేమైనా చేస్తే ఆరోగ్యంగా ఉంటామా అనే ప్రశ్నలు మెదులుతాయి. రోజుకెన్ని నీళ్లు తాగాలో, ఏమేం అలవాట్లు మంచివో, ఏమేం మార్చుకుంటే మంచిదో తెలుసుకోండి..

వేసవి ప్రభావం కిడ్నీ మీద ఎలా ఉంటుంది?

విష పదార్థాలను తొలగించడంతో పాటే మన శరీరంలో ఉప్పు, నీళ్ల సమతుల్యతను కిడ్నీ కాపాడుతుంది. ఈ పనులు చేయడానికి కిడ్నీకి నిమిషానికి లీటర్ రక్తం సరఫరా అవసరం. కానీ డీహైడ్రేషన్ వల్ల రక్త సరఫరా తగ్గి కిడ్నీ పనితీరు మందగిస్తుంది. తరచుగా వేడి ప్రాంతాల్లో పనిచేసే వాళ్లలో 15% మందికి కిడ్నీలు దెబ్బతింటాయని అంచనా.

వేసవిలో ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటంలో సాయపడేది పరిపోయేన్ని నీళ్లు తాగడం. రోజుకు తప్పకుండా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. వాతావరణం మరీ వేడిగా ఉన్నా, మీరు ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సి వచ్చినా ఇంకొన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.

మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే కిడ్నీ ఆరోగ్యం కాపాడుకోవచ్చని డాక్టర్ నిపుణ్ అన్నారు. అవేంటంటే..

ద్రవ పదార్థాలు:

డీ హైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంది. మూత్రంలో ద్రవాలు, మినరళ్లు, వ్యర్థాల అసమతుల్యత ఉన్నప్పుడు స్టోన్ అయ్యే అవకాశం ఉంది. ఒంట్లో నీళ్లు తక్కువగా ఉన్నపుడు మూత్రం గాఢత పెరగడమే దీనికి కారణం. అందుకే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటుండాలి. తీపి పదార్థాలు, పంచదార ఉన్న జ్యూసులు, కాఫీలు డీహైడ్రేషన్ ను పెంచుతాయి. వీటికి దూరంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారం:

అన్ని పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ఆహారంలో తక్కువ ఉప్పు, చక్కెరలు, తక్కువ కొవ్వు ఉండేలా చూసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వ్యాయామం:

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. దానివల్ల డయాబెటిస్, హృదయ సంబంధిత రోగాలు వచ్చే అపాయం తగ్గుతుంది.

దూమపానం, మద్యపానం:

ఈ రెండు అలవాట్లు కిడ్నీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కిడ్నీ పనితనాన్ని పాడుచేస్తాయి.

రక్తపోటు, మధుమేహ స్థాయుల్ని చెక్ చేసుకోవడం:

అధిక రక్తపోటు, మధుమేహం కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణాలు. అందుకే ఇవి అదుపులో ఉండేలా క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.

వీటితో పాటే వేసవి లో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  1. మధ్యాహ్న సమయంలో బయట ఎక్కువగా తిరగకూడదు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు.
  2. కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ కాకుండా, నీల్లు, పళ్ల రసాలకు ప్రాధాన్యం ఇవ్వండి
  3. పెయిన్ కిల్లర్ మాత్రలను ఎక్కువగా వాడకండి

WhatsApp channel