Diarrhea | ఎండలో తిరిగి వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త-seasonal disease diarrhea symptoms and preventions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Diarrhea | ఎండలో తిరిగి వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త

Diarrhea | ఎండలో తిరిగి వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Apr 05, 2022 12:09 PM IST

సమ్మర్​లో మనసు చల్లగా ఏదైనా తాగాలని కోరుకుంటుంది. దీంతో చాలామంది శీతల పానీయాలు, చల్లని నీరు, కూల్ డ్రింక్స్ తాగుతారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశముంది. చాలామందిలో డయేరియా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణం కూడా. మరి దీని లక్షణాలు ఏంటో.. ఎలా నివారించాలో తెలుసుకుందాం.

<p>కూల్ డ్రింక్స్</p>
కూల్ డ్రింక్స్

Seasonal Diseases |  వేసవిలో చల్లని నీరు, పానీయాలు తీసుకుంటే వచ్చే దుష్పభావాలలో ముందుగా చెప్పుకోవాల్సింది డయేరియా గురించి. సాధారణంగా సూర్యరశ్మికి నేరుగా గురికావడం వల్ల తరచుగా కూల్ డ్రింక్స్ తాగాలని మనసు ప్రోత్సాహిస్తుంది. ఇలా అనుకుని కూల్ డ్రింక్స్ తాగామనుకో.. అది క్రమేపి డయేరియాకు దారి తీస్తుంది. తాజాగా నమోదవుతున్న ఉష్ణోగత్రలు కూడా.. డయేరియాకు గురయ్యే వారి సంఖ్యను పెంచుతుంది. అసలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు, డయేరియా ఇన్ఫెక్షన్లకు మధ్య అసలు సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవాల్సిందే..

మండుటెండలో తిరిగి వచ్చి.. నేరుగా చల్లని నీరు లేదా.. కూల్​ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది వైరల్​ ఫీవర్, ఫ్లూ లక్షణాలకు దారి తీస్తుందని డాక్టర్ ప్రదీప్ ముఖర్జీ వెల్లడించారు. అంతేకాకుండా వేసవిలో జీర్ణవ్యవస్థ మందగిస్తుందని.. అందువల్ల జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుందని.. అది డయేరియా ఇన్ఫెక్షన్​కు దారితీస్తుందని స్పష్టం చేశారు. మసాలా, నిల్వ ఉంచిన ఆహారం తినడం మీ జీర్ణక్రియ సమతుల్యతను మరింత దెబ్బతీస్తుందని తెలిపారు. ప్రజలు తాగే నీటి వనరుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డయేరియా లక్షణాలు

డయేరియా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, శరీర ఉష్ణోగ్రతలో తేలికపాటి నుంచి మితమైన పెరుగుదల, మలంతో రక్తం రావడం కూడా రావచ్చు.

నివారణ చర్యలు

పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండడం మంచిది. అయినప్పటికీ బయటకు వెళ్లాల్సిన అవసరం రావొచ్చు. ఎండలో బయటకు వెళ్లడం అనివార్యమైనప్పుడు.. సురక్షితంగా ఉండటానికి వీటిని పాటించండి.

* ఆరోగ్యకరమైన, తక్కువ కారం, మసాలాలు తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

* తరచూ నీరు తాగి హైడ్రేట్​గా ఉండాలి.

* ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీరు, ఎరేటెడ్ పానీయాలను నివారించండి.

* సూర్యకాంతి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్, స్కార్ఫ్‌లను ఉపయోగించండి.

* లేత రంగు, కాటన్ దుస్తులను ధరించండి.

* ఖాళీ కడుపుతో బయటికి వెళ్లకుండా.. తేలికైనా ఆహారం తీసుకోవడమే మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం