Kidney Stones : కాఫీతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? తగ్గుతుందా?-does drinking coffee increase your risk of kidney stones details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Stones : కాఫీతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? తగ్గుతుందా?

Kidney Stones : కాఫీతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? తగ్గుతుందా?

HT Telugu Desk HT Telugu
Apr 02, 2023 05:30 PM IST

Kidney Stones : శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించే పనిని చూస్తాయి.

కాఫి
కాఫి

మనిషికి కిడ్నీలు చాలా ముఖ్యం. మీ రక్తంలో కొన్ని వ్యర్థాలు ఎక్కువగా ఉండి, తగినంత ద్రవం లేకుంటే, ఈ వ్యర్థాలు పేరుకుపోయి కిడ్నీ(Kidney)లో రాళ్లకు దారితీస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. అయితే కాఫీ(Coffee) తాగడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మధ్య ఉన్న సంబంధంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలి అధ్యయనాలు కెఫీన్(caffeine) వినియోగం క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నాయి.

కాఫీ తాగడం వల్ల డీహైడ్రేట్(dehydration) అవుతుందని ఓ నమ్మకం ఉంది. డీహైడ్రేట్ వలన మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాఫీలో మూత్రవిసర్జన గుణాలు ఉన్నాయి. దీని ఫలితంగా మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవచ్చని చెబుతారు. అయితే దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే కిడ్నీ స్టోన్స్‌(Kidney Stones)పై ఇటీవలి అధ్యయనాలు, కెఫిన్ వాడకం వాస్తవానికి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని హెల్త్‌లైన్ పేర్కొంది. టీ, సోడా, కాఫీ లేదా ఆల్కహాల్‌లో లభించే కెఫీన్ రక్షణగా ఉండి మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించగలదని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ నివేదించింది. కెఫిన్ తీసుకోవడంలో చిన్న పెరుగుదల కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గిస్తుంది. రోజువారీ కొన్ని కప్పుల కాఫీ టైప్ 2 మధుమేహం, డిప్రెషన్(Depression) ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే మంచి చేసేది అయినా.. మితంగానే తీసుకోవాలి.

మూత్రపిండాల్లో రాళ్లు అనేక రకాల అసౌకర్య లేదా బాధాకరమైన లక్షణాలను(Kidney Stone Symptoms) కలిగిస్తుంది. ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. దిగువ వెన్నునొప్పి(Back Pain), కడుపు నొప్పి, మీ మూత్రంలో రక్తం, వికారం మరియు వాంతులు లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటుంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.

ఒక వ్యక్తి ఆహారం.. మూత్రపిండాల్లో రాళ్లను అభివృద్ధి చేసే ప్రమాదంపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఏం తింటారు? మీరు ఎంత నీరు తీసుకుంటారు? అనేవి మీ మూత్రపిండాల్లో రాళ్లను అభివృద్ధి చేసే ప్రమాదానికి దోహదం చేస్తాయని పరిశోధనలో చెబుతున్నాయి. రోజూ తగినంత నీరు తాగాలి.

Whats_app_banner

సంబంధిత కథనం