తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dark Neck Whitening Tips । మెడ చుట్టూ నలుపుదనాన్ని ఈ చిట్కాలతో పోగోట్టుకోండి!

Dark Neck Whitening Tips । మెడ చుట్టూ నలుపుదనాన్ని ఈ చిట్కాలతో పోగోట్టుకోండి!

HT Telugu Desk HT Telugu

17 November 2022, 19:26 IST

    • Dark Neck Whitening Tips: మెడ చుట్టూ నల్లగా మారిందా, సహజ మార్గాలలో మెడ నలుపును తగ్గించుకునే చిట్కాలు ఇక్కడ చూడండి.
Dark Neck Whitening Tips
Dark Neck Whitening Tips (Unsplash)

Dark Neck Whitening Tips

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? ముఖ్యంగా ఆడవారైతే తెల్లగా మెరిసిపోవాలనుకుంటారు, కొత్తకొత్త చీరలు, మెడనిండా నగలు ధరించి అందరికీ చూపించాలనుకుంటారు. చూసేవారు వారి కట్టుబొట్టూ మెచ్చుకోవాలి. అందరూ తమను పొగడాలి, ఆ పొగడ్తలు విని ముసుముసి నవ్వులతో మురిసిపోతారు. ముఖానికి పౌడర్లు, ఐలాష్‌లు, లిపిస్టీకులు అన్ని రుద్దుకుంటారు, మెడనిండా గొలుసులు వేసుకుంటారు. మరి ఆ మెడ నల్లగా ఉందనుకోండి అప్పుడేంటి పరిస్థితి? నల్లగా ఉన్న మెడపై బంగారు గొలుసులు మరింత ధగధగ మెరుస్తాయి. కానీ అందరి దృష్టి మెడపై ఉండే బంగారం కంటే, మెడచుట్టూ ఉన్న నలుపుదనంపైనే పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Rhododendron: ఉత్తరాఖండ్లో ఒక పువ్వు వికసించగానే కలవర పడుతున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసుకోండి

Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది

Parenting Tips : పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన విషయాలు ఇవి

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలే మెడ నలుపుదనానికి దారితీస్తాయి. చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ద మెడ భాగంపై చూపరు, ముఖం కడుక్కుని ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు చుబుకం వరకు మాత్రమే కడుగుతారు. మెడ భాగాన్ని అలాగే వదిలివేస్తారు. ఈ నిర్లక్ష్యం వల్ల చాలా మందికి ముఖం తెల్లగా, మెడ నల్లగా కనిపిస్తుంది.

బయటకు ఎండలో వెళ్లేటపుడు కూడా ముఖానికి, చేతులకు సన్-స్క్రీన్ లోషన్ అప్లై చేస్తారు. మళ్లీ ఈ సందర్భంలో కూడా మెడ భాగాన్ని మరిచిపోతారు. దీంతో మెడ భాగం టాన్ అయి నల్లగా మారిపోతుంది. అప్పుడు ఎంత తోమినా మెడ తెల్లగా మారదు. ఖరీదైన ఉత్పత్తులు వాడినా ప్రయోజనం ఉండదు.

Dark Neck Whitening Tips- మెడ నలుపును తెలుపు చేసుకునే చిట్కాలు

సహజ మార్గాలలోనే ఈ మెడ నలుపుదనం సమస్యను పరిష్కరించుకోవచ్చు. అందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

కాఫీ పౌడర్ - షుగర్ ప్యాక్:

కాఫీ పౌడర్ కేవలం కాఫీ తయారీకి మాత్రమే కాకుండా మీ మెడపైన టాన్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఒక చెంచా కాఫీ పొడికి ఒక చెంచా చక్కెర, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడిన మెడపై అప్లై చేసి, 5-10 నిమిషాల పాటు వేళ్లతో పైకి మసాజ్ చేసి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే మెడపైన నలుపుదనం తగ్గుపోతుంది. కాఫీ పౌడర్ చర్మానికి మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. ఇది మృత చర్మ కణాలను సులభంగా తొలగిస్తుంది. మెడ మీద ముడతలను కూడా తొలగిస్తుంది.

దోసకాయ మసాజ్:

దోసకాయను సన్నని, గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోండి. దీనిని మెడపై 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దోసకాయ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మెడపై నలుపు రంగును తొలగిస్తుంది. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మెడ నలుపు పోయి చర్మం క్లియర్ గా మారుతుంది.

మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్ కూడా డార్క్ నెక్ ను తొలగిస్తుంది. పాల మీగడలో కాస్త నిమ్మరసం, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా గోధుమ పిండిని కూడా కలుపుకొని రుద్దుకోవచ్చు.

టాపిక్