Natural Black Beard । గడ్డం తెల్లబడుతుందా? అర్జున్ రెడ్డిలా దట్టమైన నల్లటి గడ్డం పొందేందుకు చిట్కాలు!
16 November 2022, 22:08 IST
- Natural Black Beard: గడ్డం తెల్లబడుతుందని చింతిస్తున్నారా? చింత వలదు, ఇక్కడ సహజంగా మీ తెల్ల గడ్డాన్ని నల్లగా మార్చే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి పాటిస్తే అర్జున్ రెడ్డిలా అయిపోవచ్చు.
Home remedies to get Natural Black Beard
Home Remedies to Get Natural Black Beard: వయసు పెరిగేకొద్దీ తెల్లవెంట్రుకలు రావడం సహజం. మగవారికైతే వారి గడ్డం కూడా నెరిసి తెల్లగా మారుతుంది. అయినప్పటికీ ఇప్పుడు తెల్ల గడ్డం కూడా ఫ్యాషన్ ట్రెండ్ గా చలామణీ అవుతుంది. తెల్ల గడ్డం పెంచుకొని, నీట్ గా ట్రిమ్ చేసుకొని, నళ్లకళ్లజోడు పెట్టుకుంటే ఆ స్టైలే వేరు. అయితే వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాషన్ కొనసాగించవచ్చు. కానీ యుక్త వయసులో ఉన్నప్పుడే గడ్డం నెరిసిపోతుంటే ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు.
ఇటీవల కాలంలో పెళ్లి వయసు 30 దాటిపోతుంది. ఒకవైపు తల వెంట్రుకలు రాలిపోవడం, మరోవైపు గడ్డం తెల్లబడటం జరిగితే అంతకంటే పెద్ద సమస్య ఉంటుందా? అసలే ఈ మధ్య అమ్మాయిలు కూడా అర్జున్ రెడ్డిలా గడ్డం పెంచుకునే వారినే ఇష్టపడుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
దట్టమైన నల్లటి గడ్డం కోరుకునే మగవారికి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. మార్కెట్లో గడ్డాలు, మీసాలకు ప్రత్యేకంగా అనేక నూనెలు, షాంపూలు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. అయితే వీటిలోని రసాయనాలు చర్మంపై దుష్ప్రభావాలు చూపుతాయి. అయితే, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా కూడా గుబురు గడ్డం పెంచుకోవచ్చు. ఆ చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
బ్లాక్ టీ
బ్లాక్ టీ సహజ రంగుగా పనిచేస్తుంది. కొన్ని నీరు, టీపొడి కలిపి బ్లాక్ టీగా మరిగించండి. తర్వాత వడగట్టి బ్లాక్ టీని గడ్డంపై అప్లై చేయాలి. సుమారు గంట తర్వాత నీటితో కడగాలి. దీంతో గడ్డం సహజంగా నల్లగా మారుతుంది.
నల్ల నువ్వుల పేస్ట్
మనం ఆహారంలో ఉపయోగించే నల్ల నువ్వులు జుట్టుకి వాడవచ్చు. సహజంగా జుట్టు నల్లబడటానికి ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. నల్ల నువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం మెత్తని పేస్ట్ చేసి. ఈ పేస్ట్‌ని గడ్డానికి పట్టించి ఆరనివ్వాలి. అది ఆరిపోయినప్పుడు, గడ్డం శుభ్రం చేయండి. దీని వల్ల సహజంగానే గడ్డం జుట్టు నల్లగా మారుతుంది.
హెన్నా మిశ్రమం
హెన్నా పౌడర్‌లో నిమ్మరసం, కొబ్బరి నూనె, వెనిగర్ కలపండి లేదా హెన్నా, షికాకాయ్, నిమ్మరసం మిశ్రమమైనా సరే. ఈ పేస్ట్‌ని గడ్డానికి పట్టించి ఆరనివ్వాలి. అది ఆరిపోయాక కడిగేయాలి. ఈ పేస్ట్‌తో సహజంగానే గడ్డం జుట్టు నల్లగా మారుతుంది.
పోషకాహారం
బయటి నుంచే కాకుండా లోపలి నుంచి కూడా పోషణ ఉండాలి. చిన్న వయస్సులోనే గడ్డం తెల్లగా మారుతున్నట్లయితే, ఆహారంలో విటమిన్ బి, ఇ లోపం ఉందని అర్థం. కాబట్టి విటమిన్లు సమృద్ధిగా ఉండే గింజలు, పండ్లు, కూరగాయలలో తగినంత మొత్తంలో తీసుకోవాలి. ఇది జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
టాపిక్