తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Beard Growth Iగ‌డ్డం రావట్లేదని షేవ్ చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

Beard Growth Iగ‌డ్డం రావట్లేదని షేవ్ చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

HT Telugu Desk HT Telugu

10 March 2022, 11:59 IST

google News
    • కొంత మందికి గడ్డం పెంచుకోవాలని ఉన్నప్పటీకి.. త్వరగా రాదు. ఒకవేళ వచ్చినా కంప్లీట్‌గా ఉండదు. గడ్డం పూర్తిగా రావడం కోసం రకారకాల ప్రయోగాలు చేస్తుంటారు. షేవ్‌ చేసుకుంటుంటారు.. అనేక రకాల క్రిమ్స్ వాడుతుంటారు
shaving
shaving (istockphoto)

shaving

నేటితరానికి గడ్డంపై మక్కువ ఎక్కువైంది. కుర్రోళ్లంతా ట్రెండీ లుక్‌ కోసం గడ్డా్న్ని రకరకాల స్టైల్లో పెంచేస్తున్నారు. ప్రస్తుతం స్టైల్‌‌కు సింబల్‌గా మారిపోయిన బియర్డ్... ప్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది. అయితే కొంత మందికి గడ్డం పెంచుకోవాలని ఉన్నప్పటీకి.. త్వరగా రాదు. ఒకవేళ వచ్చినా కంప్లీట్‌గా ఉండదు. గడ్డం పూర్తిగా రావడం కోసం రకారకాల ప్రయోగాలు చేస్తుంటారు. షేవ్‌ చేసుకుంటుంటారు.. అనేక రకాల క్రిమ్స్ వాడుతుంటారు. అయితే షేవింగ్‌ చేయడం వల్ల గడ్డం వస్తుందనుకోవడం పోరపాటే... పదే.. పదే షేవింగ్‌ చేయడం వల్ల ముఖం గరుకుగా మారుతుంది. అయినప్పటికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు..

వంటింటి చిట్కాలు

 

రెండు స్పూన్ల నిమ్మరసం తీసుకోని దానిని దాల్చిన చెక్క పొడిలో కలిపి చెంపలకు పట్టించాలి. కొద్ది సేపు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే యూకలిప్టస్‌ నూనెను నువ్వుల నూనెతో కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మసాజ్‌ చేసుకుండాలి. గడ్డం రావడానికి అందుబాటులో ఉన్న రో చిట్కా .. రోజ్‌బేరీ నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని గడ్డంపై రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

ఆరోగ్య సూత్రాలు

 

అలాగే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా కూడా వయసుకు తగ్గట్టుగా మార్నులు ఉంటాయి. ప్రొటీన్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, ముఖ భాగానికి తగిన వ్యాయామం, ఒత్తిడికి లేకుండా ఉండటం వల్ల గడ్డం త్వరగా వస్తుంది. టీనేజ్‌ వయసు ఉన్నవారు రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం వల్ల గడ్డం బాగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్లో లభించే క్రిమ్‌లను గడ్డం వద్ద అప్లై చేయకూడదు. సహాజ పద్దతిలో పొందేందుకు ప్రయత్నిస్తే మంచిది

తదుపరి వ్యాసం