తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సీనియర్ సిటిజన్ కోసం Hdfc, Sbi, Icici బ్యాంక్స్ Fdపై ఇస్తున్న వడ్డీరేట్లు ఇవే..

సీనియర్ సిటిజన్ కోసం HDFC, SBI, ICICI బ్యాంక్స్ FDపై ఇస్తున్న వడ్డీరేట్లు ఇవే..

20 September 2022, 15:10 IST

    • Fixed Deposit Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్స్ అనేవి.. ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల్ మొదటి పెట్టుబడి ఎంపిక ఇవే అని చెప్పవచ్చు. అందుకే బ్యాంకర్లు కూడా.. వారికోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకట్టుకునే వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే తాజాగా HDFC, SBI, ICICI బ్యాంక్ తమ వడ్డీరేట్లలో మార్పులు చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
ఫిక్స్‌డ్ డిపాజిట్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్స్

ఫిక్స్‌డ్ డిపాజిట్స్

Fixed Deposit Rates : పెట్టుబడుల విషయానికి వస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి సీనియర్ సిటిజన్ల మొదటి ఎంపిక అని చెప్పవచ్చు. ఆర్థిక సంస్థలకు దీని గురించి బాగా తెలుసు. అందుకే పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లను ఆకర్షించడానికి ఫిక్సెడ్ డిపాజిట్స్​పై ఇంట్రెస్టింగ్ డీల్స్ అందిస్తాయి. లాభదాయకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను నిర్వహిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్‌లు, టైమ్ డిపాజిట్‌లు అన్నీ తమ సురక్షిత రాబడి కారణంగా రిస్క్ లేని పెట్టుబడిదారులను ఇవి ఆకర్షిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

పైగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTB కింద డిపాజిట్‌పై వడ్డీకి పన్ను-మినహాయింపు ఉన్నందున సీనియర్ సిటిజన్‌లు పన్నుల నుంచి మినహాయింపు పొందుతారు. దీని వలన వారు రూ. 50,000 వరకు పొదుపు చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ కోసం HDFC బ్యాంక్ వడ్డీ రేట్లు

HDFC బ్యాంక్ ఏడు నుంచి14 రోజుల పాటు చేసే డిపాజిట్లపై 2.75 శాతం రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తుంది. 3 సంవత్సరాలు.. 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్‌పై.. సీనియర్ సిటిజన్‌లకు ఆఫర్ రేటు 6.60 శాతం. వర్తించే రేటు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం 6.5 శాతం.

సీనియర్ సిటిజన్ కోసం SBI బ్యాంక్ FD వడ్డీ రేట్లు

SBI సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న SBI పెన్షనర్లు సాధారణ రేటు కంటే 0.50% వడ్డీని పొందుతారు. ఇది ఐదు సంవత్సరాల కాలానికి, 10 సంవత్సరాల వరకు రూ. 1 కోటి కంటే తక్కువ మొత్తంలో సీనియర్ సిటిజన్లకు 6.45% వడ్డీ రేటును అందిస్తుంది.

సీనియర్ సిటిజన్ కోసం ICICI బ్యాంక్ వడ్డీ రేటు:

ICICI బ్యాంక్ FDని తెరవడానికి కనీసం రూ. 10,000 డిపాజిట్ చేయాలి. మూడేళ్ల కంటే ఎక్కువ ఉన్న ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలానికి, రుణదాత సీనియర్ సిటిజన్‌లకు 6.60 శాతం రేటును అందిస్తుంది.