SBI special fd for senior citizens: ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ పొడిగింపు-sbi special fixed deposit scheme for senior citizens extended till march 2023 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sbi Special Fixed Deposit Scheme For Senior Citizens Extended Till March 2023

SBI special fd for senior citizens: ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 10:54 AM IST

SBI special fd for senior citizens: ఎస్‌బీఐ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగించింది.

సీనియర్ సిటిజెన్ల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించిన ఎస్‌బీఐ
సీనియర్ సిటిజెన్ల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించిన ఎస్‌బీఐ (MINT_PRINT)

SBI special fd for senior citizens: సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని మళ్లీ పొడిగించింది. మే 2020లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్‌ల కోసం SBI 'WECARE' సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

దీని గడువు తొలు సెప్టెంబర్ 2020 వరకు ఉంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని చాలాసార్లు పొడిగించారు. తాజాగా మరోసారి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది.

సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఈ “SBI Wecare” డిపాజిట్ స్కీమ్‌లో 0.30 శాతం అదనపు వడ్డీ రేటు చెల్లిస్తుంది. '5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం' ఇందులో ఫిక్స్‌డ్ చేయాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్ల కోసం SBI ప్రత్యేక FD పథకం తాజా వడ్డీ రేట్లు

సీనియర్ సిటిజన్ల కోసం SBI ప్రత్యేక FD పథకం -వీ కేర్ - 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో అదనంగా 0.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ప్రస్తుతం SBI సాధారణ ప్రజల కోసం ఐదు సంవత్సరాల FD పై 5.65% వడ్డీ రేటును ఇస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD పథకం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే FDకి వర్తించే వడ్డీ రేటు 6.45%గా ఉంటుంది. ఈ రేట్లు 8 జనవరి 2021 నుండి అమలులోకి వస్తాయి.

SBI ఉత్సవ్ డిపాజిట్ పథకం

దేశం యొక్క 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ "ఉత్సవ్ డిపాజిట్" అనే పరిమిత ఎడిషన్ బ్రాండ్-న్యూ టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. ఆగస్ట్ 15, 2022 నుండి ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ 6.1 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ఈ డీల్ 75 రోజులు లేదా అక్టోబర్ 30, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తాజా వడ్డీ రేట్లు

7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI సాధారణ పౌరులకు 2.90% నుండి 5.65% వరకు, సీనియర్ సిటిజన్‌లకు 3.40% నుండి 6.45% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లను చివరిగా 13 ఆగస్టు 2022న సవరించింది.

IPL_Entry_Point