HDFC Bank FD rates hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ-hdfc bank hikes interest rates on fixed deposits check new rates here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hdfc Bank Hikes Interest Rates On Fixed Deposits Check New Rates Here

HDFC Bank FD rates hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

HT Telugu Desk HT Telugu
Aug 18, 2022 04:49 PM IST

HDFC Bank FD rates hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (hdfc bank)

HDFC Bank FD rates hike: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 18, 2022 నుండి అమలులోకి వస్తాయి. తాజా సవరణ తర్వాత బ్యాంక్ వడ్డీ రేట్లను 40 బీపీఎస్ పాయింట్ల వరకు పెంచింది. 

ట్రెండింగ్ వార్తలు

బ్యాంక్ ప్రస్తుతం ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.75 శాతం నుండి 5.7 శాతం వరకు, సీనియర్ సిటిజన్‌లకు 3.2 శాతం నుండి 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

HDFC Bank FD rates hike: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు ఇలా..

7 నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75% వడ్డీ రేటు అందిస్తోంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 30 నుండి 89 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 3.25% వడ్డీ రేటును అందిస్తుంది. 

90 రోజుల నుంచి ఆరు నెలల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75%గా ఉంటుంది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.65% వద్ద కొనసాగుతుంది.

ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచింది. 5.35% నుండి 5.50 శాతానికి పెంచింది. 

ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. 15 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతంగా వడ్డీ రేట్లు నిర్ధారించింది. 

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 5.50% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. మూడేళ్ల ఒకరోజు నుంచి ఐదేళ్లలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.70% నుండి 6.10%కి 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ అయితే 5.75% చెల్లిస్తారు. 

మూడేళ్ల ఒక రోజు నుంచి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 6.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 6.60% వడ్డీ రేటును అందిస్తోంది.

<p>HDFC Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పట్టిక</p>
HDFC Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పట్టిక (hdfcbank.com)

సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రామాణిక రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటును పొందుతారు. సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.50% చొప్పున (0.75% అదనపు వడ్డీ రేటు) పొందుతారు.

‘5 సంవత్సరాల ఒక రోజు నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి కోసం రూ. 5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకునే సీనియర్ సిటిజన్‌లకు 0.25% అదనపు వడ్డీ లభిస్తుంది. 18 మే 2020 నుండి 30 సెప్టెంబర్ 2022 వరకు ప్రత్యేక డిపాజిట్ ఆఫర్ సమయంలో సీనియర్ సిటిజన్లు కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో చేరినా, అలాగే రెన్యూవల్ చేసిన ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రవాస భారతీయులకు వర్తించదు’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

IPL_Entry_Point