HDFC bank sms services : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్​ న్యూస్​..-hdfc bank introduces new sms banking facility for its customers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hdfc Bank Introduces New Sms Banking Facility For Its Customers

HDFC bank sms services : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్​ న్యూస్​..

Sharath Chitturi HT Telugu
Sep 04, 2022 04:46 PM IST

HDFC bank sms services : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కస్టమర్లకు ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 24గంటల పాటు ఇవి పనిచేస్తాయని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు చెప్పింది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు
హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు (MINT_PRINT)

HDFC bank new SMS banking services : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్​ న్యూస్​! ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలను ప్రారంభించినట్టు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ప్రకటించింది. ఇకపై.. 356రోజులు- 24గంటల పాటు ఎవరైనా, ఎక్కడి నుంచైనా.. ఈ ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

కొత్త ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలతో.. కస్టమర్లు తమ అకౌంట్​ బ్యాలెన్స్​, సమ్మరీస్​ తెలుసుకోవడంతో పాటు లోన్​లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా.. క్రెడిట్​ కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు, చెక్​బుక్​ల కోసం అప్లై చేసుకోవచ్చు. అకౌంట్​ స్టేట్​మెంట్​తో పాటు మరిన్ని విషయాలను ఈ హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవల ద్వారా కస్టమర్లు పొందవచ్చు.

SMS Banking HDFC bank : ఈ ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. ఫలితంగా.. భారీ కీవర్డ్స్​ను గుర్తుపెట్టుకోవాల్సిన శ్రమ తప్పింది. కస్టమర్లు ఏం టైప్​ చేసినా.. ఐఏ అర్థం చేసుకుని ప్రాసెస్​ చేస్తుంది.

"ఒక్క టెక్స్ట్​ మెసేజ్​తో బ్యాంకింగ్​ సేవలు పొందవచ్చు. మాతో బ్యాంకింగ్​ చేయండి. ఒక్క ఎస్​ఎంస్​తో మీకు వివిధ బ్యాంకింగ్​ సేవలను అందిస్తున్నాము. 24గంటల పాటు ఈ సేవలను మీరు పొందవచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు చెప్పింది.

ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలను పొందేందుకు ముందుగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ నుంచి 'Register'  <space> 'కస్టమర్​ ఐడీ చివరి నాలుగు డిజిట్లు' <space> 'అకౌంట్​ నెంబర్​లోని చివరి నాలుగు డిజిట్లు' టైప్​ చేసి.. 7308080808 కి ఎస్​ఎంఎస్​ పంపించాలి. అప్పుడు మీ ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలు రిజిస్టర్​ అయినట్టు మీకు ఎస్​ఎంఎస్​ వస్తుంది.

HDFC Banking service : అదే బ్యాంకుకు వెళ్లి.. మీరు ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవల కోసం అప్లికేషన్​ ఫామ్​ను సబ్మిట్​ చేస్తే.. 4 వర్కింగ్​ డేస్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రస్తుతం.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ సేవలు ఇంగ్లీష్​ భాషలోనే అందుబాటులో ఉంది.

ఏటీఎం ద్వారా ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ రిజిస్టర్​ చేసుకోండి ఇలా..

  • స్టెప్​ 1:- మీ సమీపంలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఏటీఎంకు వెళ్లండి.
  • స్టెప్​ 2:- మీ డెబిట్​/ఏటిఎం కార్డును ఇన్​సర్ట్​ చేయండి. పిన్​ టైప్​ చేయండి.
  • స్టెప్​ 3:- హోం పేజీలో 'మోర్​ ఆప్షన్స్​'లోకి వెళ్లండి. ఎస్​ఎంఎస్​ బ్యాంకింగ్​ రిజిస్ట్రేషన్​ కోసం మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ను టైప్​ చేయండి.
  • స్టెప్​ 4:- 'కన్​ఫర్మ్​' మీద క్లిక్​ చేయండి.

రిజిస్ట్రేషన్​ ప్రక్రియ సక్సెస్​ఫుల్​ అయినట్టు మీకు ఓ మెసేజ్​ వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్