తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eggs For Hair Care : కోడిగుడ్డుతో ఇలా చేస్తే.. మీ జుట్టు సమస్యలు తగ్గుతాయి

Eggs For Hair Care : కోడిగుడ్డుతో ఇలా చేస్తే.. మీ జుట్టు సమస్యలు తగ్గుతాయి

HT Telugu Desk HT Telugu

10 March 2023, 12:12 IST

    • Hair Care Tips : కోడిగుడ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు. రోజుకో కోడి గుడ్డు తినాలని చెబుతారు వైద్యులు. అయితే గుడ్డుతో మీ జుట్టు సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.
జుట్టు సమస్యలు
జుట్టు సమస్యలు

జుట్టు సమస్యలు

కోడిగుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు దొరుకుతాయి. ఇవి సంపూర్ణ పౌష్టికాహారం అని చెబుతారు. వీటిని రోజూ తింటే.. ఆరోగ్యానికి మంచిది. అయితే కోడిగుడ్ల(Eggs)తో జుట్టు సమస్యలు నుంచి కూడా బయట పడవచ్చు. మీ జుట్టు(Hair) మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే.. గుడ్డును ఉపయోగించుకోవచ్చు. హెయిర్ మాస్క్(Hair Mask)లను తయారు చేసుకుని వాడుకోవాలి. మీ జట్టు సమస్యలు తగ్గుతాయి.

ఒక గిన్నెలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల గుడ్డు పచ్చసోన తీసుకోవాలి. అందులో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల కలబంద జెల్(aloevera gel) తీసుకోండి. అంతేకాదు.. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేడి చేయండి. ఈ మూడింటిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చట్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇక తలస్నానం చేయాలి.

అంతేకాదు.. గుడ్డు, పెరుగు, నిమ్మరసాన్ని(Lemon) కూడా వాడుకోవచ్చు. ఒక గుడ్డును కొట్టి దాంట్లోని సొన తీసి అందులో మూడు లేదా నాలుగు టేబుల స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో నెమ్మదిగా జుట్టు(Hair) మీద మాస్క్ లాగా అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక గంటపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం(Headbath) చేయాలి.

పైవిధంగా గుడ్డుతో హెయిర్ మాస్క్ లా చేసుకోవచ్చు. ఈ కారణంగా జుట్టు(Hair) సమస్యలు పోతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉండే గుడ్డు హెయిర్ మాస్క్ అవసరమైన పోషణను అందిస్తుంది. దెబ్బతిన్న జుట్టుకు మెరుపును అందిస్తుంది.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

టాపిక్