Chilli Garlic Omelette Recipe | చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ ఆదివారానికి చెప్పండి 'గుడ్డు' మార్నింగ్!-have an egglicious sunday with chilli garlic omelette breakfast quick recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chilli Garlic Omelette Recipe | చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ ఆదివారానికి చెప్పండి 'గుడ్డు' మార్నింగ్!

Chilli Garlic Omelette Recipe | చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ ఆదివారానికి చెప్పండి 'గుడ్డు' మార్నింగ్!

HT Telugu Desk HT Telugu

Chilli Garlic Omelette Recipe: ఆమ్లెట్ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కాస్త భిన్నంగా చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ ఇక్కడ ఉంది ట్రై చేయండి.

Chilli Garlic Omelette Recipe (Slurrp)

ఈరోజు ఆదివారం అంటే మాంసాహార ప్రియులకు పండగ రోజు, మరి సెలవు రోజున అద్భుతమైన రుచి కలిగిన చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌తో మీ రోజును స్టార్ట్ చేయడానికి మించిన ఆనందం ఏముంటుంది? పేరులో సూచించిన విధంగా, ఈ ఆమ్లెట్ మిరపకాయల కారంతో, వెల్లుల్లి సువానసలతో తయారు చేసే వంటకం. ఇది మీరు ఎప్పుడూ తినే ఆమ్లెట్ రుచికి కాస్త విభిన్నంగా ఉంటుంది, కానీ రుచిలో మాత్రం తగ్గేదేలే. కారం తినాలనే ఇష్టం ఉన్నవారికి ఇది బెస్ట్ అల్పాహారం. ఈ ఆమ్లెట్‌లో మిరపకాయ, వెల్లుల్లి రుచులు మిళితం అవుతాయి. అంతేకాకుండా ఇది చాలా సులభంగా, తక్కువ సమయంలోనే చేసుకోగలిగే అల్పాహారం.

చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ తయారు చేయటానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనల ప్రకారం చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ రెసిపీని ప్రయత్నించండి.

Chilli Garlic Omelette Recipe కోసం కావలసినవి

  • 2 గుడ్లు
  • 1/2 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్
  • 1/4 టీస్పూన్ కారం పొడి
  • 3- 4 వెల్లుల్లి రెబ్బలు తరిగినవి
  • 2 టీస్పూన్ల వెన్న
  • ఉప్పు రుచికి తగినంత

చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ తయారీ విధానం

1. ముందుగా ఒక గ్లాసులో రెండు గుడ్లు పగలగొట్టి, బాగా గిలక్కొట్టండి.

2.ఇందులో తరిగిన వెల్లుల్లి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కారం పొండి వేసి బాగా కలపండి.

3. ఇప్పుడు పాన్‌లో వెన్నను వేడి చేసి, అందులో గిలక్కొట్టిన గుడ్డు మిశ్రమం వేసి ఆమ్లెట్ చేయండి, ఆమ్లెట్‌ను రెండు వైపులా ఉడికించండి.

4. మరింత రుచి కోసం పైనుంచి కొంత చీజ్ వేసి కూడా ఉడికించుకోవచ్చు.

5. అంతే, చిల్లీ గార్లిక్ ఆమ్లెట్ రెడీ, ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి, కాఫీ తాగుతూ ఆమ్లెట్ రుచిని ఆనందించండి!

సంబంధిత కథనం