Egg Yolk Benefits । గుడ్డు పచ్చసొనను పక్కనపెడుతున్నారా? దానిలోని పోషకాలు తెలిస్తే తినకుండా ఉండరు!
- Egg Yolk Benefits: కోడి గుడ్లు ఉడికించినపుడు కొందరు తెల్లసొనని మాత్రమే తిని, లోపలి పచ్చసొనను వదిలేస్తారు.గుడ్డు పచ్చసొన నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదా? ఇక్కడ తెలుసుకోండి.
- Egg Yolk Benefits: కోడి గుడ్లు ఉడికించినపుడు కొందరు తెల్లసొనని మాత్రమే తిని, లోపలి పచ్చసొనను వదిలేస్తారు.గుడ్డు పచ్చసొన నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదా? ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
గుడ్లు మంచి పౌష్టికాహారం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ప్రోటీన్-రిచ్ సూపర్ ఫుడ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ కొందరు గుడ్డు పచ్చసొన తినరు. కానీ దీనిలోనే పోషకాలు అధికం, చూడండి..
(2 / 6)
గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, బి-12 , కె ఉంటాయి. ఈ విటమిన్లు శరీరానికి చాలా అవసరం. పచ్చసొనలో 'లుటీన్' , 'క్సాంథైన్' అనే రెండు రకాల కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. ఇది అతినీలలోహిత కిరణాల హానికరమైన ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది. (Unsplash)
(3 / 6)
గుడ్డు పచ్చసొనలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, గుండె-ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.(Pixabay)
(4 / 6)
పచ్చ సొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. వీటిని తింటే చాలా సేపు ఆకలి అనిపించదు.
(5 / 6)
ఒక రోజుకు 2-3 గుడ్లను పచ్చసొనతో కలిపి తింటేనే ఆరోగ్యం. అయితే మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే వారానికి 3-4 గుడ్ల కంటే ఎక్కువ తినకండి.
ఇతర గ్యాలరీలు