తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Relive Constipation : వీటిని మీ డైట్​లో చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య దూరమైపోతుంది..

Foods to Relive Constipation : వీటిని మీ డైట్​లో చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య దూరమైపోతుంది..

20 November 2022, 14:30 IST

    • Foods to Relive Constipation : ప్రతిరోజూ మలవిసర్జన చేయకపోవడం వల్ల.. మీ కడుపు ఉబ్బరంగా మారి.. అసౌకర్యాన్నిస్తుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. మీ ఇబ్బందిని వదిలించుకోవడానికి.. కొన్ని ఇంటి నివారణలు ఉపయోగపడతాయి అంటున్నారు ఆహార నిపుణులు.
మలబద్ధకాన్ని ఇలా వదిలించుకోండి..
మలబద్ధకాన్ని ఇలా వదిలించుకోండి..

మలబద్ధకాన్ని ఇలా వదిలించుకోండి..

Foods to Relive Constipation : మలబద్ధకం ఎఫెక్ట్.. మొత్తం మీ శరీరంపై ప్రభావం చూపిస్తుంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలు శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. పేలవమైన జీర్ణక్రియ, తక్కువ రోగనిరోధక శక్తి, మానసిక ఒత్తిడి, జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ మొదలైన వాటి వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ ఆహారం ఏంటో.. వాటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

అల్లం

మన రోజువారీ వంటలలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో మంచి జీర్ణక్రియను కలిగిస్తుంది. అల్లంలోని శక్తి.. పెద్దపేగులో సంభవించే ఒత్తిడిని నిరోధిస్తుందని ఓ అధ్యయనంలో కనుగొన్నారు. అంతేకాకుండా.. పేగు కదలికలను కూడా వేగవంతం చేస్తుంది. ఇది కఫం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి మీ రోజువారీ టీలో చక్కెరకు బదులుగా.. అల్లాన్ని వేసుకుని తాగవచ్చు. ఇది మలబద్ధకం నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది.

గోరు వెచ్చని నీరు..

రోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నోటి నుంచి పురీషనాళం వరకు జీర్ణాశయంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపే సామర్థ్యం వేడి నీటికి ఉంది. వేడి నీటిని తాగడం వల్ల పొట్టలో అధికంగా ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌ల స్రావాన్ని నియంత్రిస్తుంది. అంతే కాకుండా శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది.

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల సరైన సమయంలో ఆకలి పుడుతుందని.. మూత్రాశయం శుభ్రపడుతుందని.. జీర్ణశక్తి మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఆహారం జీర్ణం కావడం వల్ల మలబద్ధకం ఏర్పడదు.

అంజీర్

అంజీర్‌లో మలబద్దక నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీనిని పండు రూపంలో, డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇవి జీర్ణం కావడానికి కష్టమైన ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయం చేస్తాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అంజీర పండ్లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది. వీటిలోని ఫిసిన్ అనే ఎంజైమ్ పొట్ట, పురీషనాళంలో కనిపించే పురుగులను నాశనం చేస్తుంది.

నల్లని ఎండు ద్రాక్షలు

నల్లటి ఎండు ద్రాక్షాల్లో.. పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మలబద్ధకం రాదు. నల్ల ద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ ఐదు లేదా ఆరు నల్ల ద్రాక్షలను రాత్రి నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు తెల్లవారుజామున నెమ్మదిగా నమలాలి.

ఈ పండు తింటే చాలా లాలాజలం స్రవిస్తుంది. ఇందులో ఉండే అమైలేస్ అనే ఎంజైమ్ ఆహారం జీర్ణం కావడానికి మంచిగా సహాయం చేస్తుంది. నల్లద్రాక్షను నిత్యం తింటే మలబద్ధకం పోతుంది.

మొక్కజొన్నలు

మొక్కజొన్న జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. గ్లూటెన్ ఉండదు. మొక్కజొన్నలో ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

గోధుమ కంటే మొక్కజొన్న సులభంగా జీర్ణమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది సరైన ఆహారం. ఇది వృద్ధుల సహజ మలబద్ధకాన్ని కూడా నయం చేస్తుంది.

ఇవే కాకుండా.. మీరు కచ్చితంగా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం తప్పకుండా చేయాలి. వీటిని పాటించడం వల్ల మీరు ఈ మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఫాలో అయినా సమస్య తీరకపోతే మాత్రం కచ్చితంగా.. వైద్యుని సంప్రదించాలి.

తదుపరి వ్యాసం