చిటపట చినుకుల వేళ మొక్కజొన్న.. ఇలా వేడి వేడిగా చేసుకొని తినండి!-corn should be eaten in the rainy season it is very beneficial for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చిటపట చినుకుల వేళ మొక్కజొన్న.. ఇలా వేడి వేడిగా చేసుకొని తినండి!

చిటపట చినుకుల వేళ మొక్కజొన్న.. ఇలా వేడి వేడిగా చేసుకొని తినండి!

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 10:02 PM IST

Heavy rains in Telangana: బయట వాతావరణం చల్లగా ఉంది.. ఈ సమయంలో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుందా?. అయితే నూనె పదార్థాలకు బదులుగా మొక్కజొన్న పొత్తులు చాలా మంచిది. అతి చౌకగా లభించే మొక్కజొన్నలను వివిధ రకాల రెసీలను చేసుకుని తినండి. వర్షకాలంలో వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

<p>corn</p>
corn

వర్షం పడుతున్నప్పుడు అలా బయటకు చూస్తూ ఏదైన వేడి వేడిగా తినాలని చాలా మంది కొరుకుంటారు. అలా వర్షాన్ని చూస్తూ వేడి వేడిగా ఉండే మొక్కజొన్న గింజలను తింటూ ఉంటే ఉంటుంది.. కదా.. ఆహా .. ఆ మజానే వేరు కదా.. ఎప్పుడూ అలా రొటీన్ స్నాక్స్ తినేకన్నా వీటిని ట్రై చేయండి. ఇవి రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న గింజలలో ఫైబర్, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ మొదలైన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న రెసిపీగా చేసుకుని కూడా తినవచ్చు . ఎలా తిన్నా దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి . ముఖ్యంగా వర్షాకాలంలో మొక్కజొన్న గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది -

వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్యం పాలవుతుంటారు. అటువంటి సందర్భాలలో, మొక్కజొన్న గింజల తింటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొక్కజొన్న తీసుకోవడం వల్ల రోగనిరోధక కణాలు బలపడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ మొక్కజొన్నలను తినవచ్చు.

జీర్ణవ్యవస్థ బలపడుతుంది -

వర్షాకాలం అనేక జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ కాలంలో కలుషిత నీరు. పర్యావరణం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అటువంటి సమయంలో మొక్కజొన్న గింజలను తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తొలుగుతాయి. మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో వీటిని తింటే కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్ మొదలైన వాటి బాధ ఉండదు. మొక్కజొన్న గింజల వాడకం దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది -

వర్షాకాలంలో చర్మంపై మొటిమలు, ఎరుపు సమస్య పెరుగుతుంది. ఈ సమయంలో, మీరు మొక్కజొన్న తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మొక్కజొన్న గింజలు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇది చర్మ ఆకృతిని మెరుగుపరిచి.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకోండి

కార్న్ సూప్ రిసిపి -

వర్షాకాలంలో మొక్కజొన్న సూప్ తీసుకోవచ్చు. మొక్కజొన్న గింజలు, రెండు కప్పుల నీరు ,కొద్దిగా ఉప్పును కుక్కర్‌లో వేసి కార్న్ సూప్ తయారు చేయాలి. 2 నుండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత, మొక్కజొన్న గింజలను గ్రైండ్ చేసి పాన్‌లో వేడి చేయండి. వాటికి కొంచెం కొత్తిమీర. ఎండుమిర్చి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేడి వేడి సూప్‌ని ఆస్వాదించండి.

కార్న్ శాండ్‌విచ్ రెసిపి -

వర్షంలో మొక్కజొన్నతో శాండ్‌విచ్‌లను చేసుకుని ఆ వాతావరణాన్ని ఆనందిస్తూ తినండి. దీని కోసం, రొట్టెలో కొత్తిమీర చట్నీ వేసి. దానిపై ఉడికించిన మొక్కజొన్న గింజలు ఇతర కూరగాయలను ఉంచండి. ఆ శాండ్విచ్‌ను కాల్చి.. వేడి వేడిగా తినండి.

Whats_app_banner

సంబంధిత కథనం