తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Constipation Cure Naturally : ఇంటి నివారణులతో మలబద్ధకాన్ని తగ్గించుకోండిలా..

Constipation Cure Naturally : ఇంటి నివారణులతో మలబద్ధకాన్ని తగ్గించుకోండిలా..

10 November 2022, 16:08 IST

google News
    • Constipation Cure Naturally : ప్రతిరోజూ మలవిసర్జన చేయకపోవడం వల్ల మీరు కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. ఈ రకమైన సమస్యల గురించి చెప్పడానికి చాలామంది సిగ్గుపడతారు. అలాంటి ఇబ్బంది ఉన్నవారు కొన్ని మార్పులతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు. 
మలబద్ధకం సమస్యను ఇలా తగ్గించుకోండి..
మలబద్ధకం సమస్యను ఇలా తగ్గించుకోండి..

మలబద్ధకం సమస్యను ఇలా తగ్గించుకోండి..

Constipation Cure Naturally : మలబద్ధకం అనే సమస్య మీకు చాలా అసౌకర్యాన్ని ఇస్తుంది. ఈ సమస్య గురించి ఎవరికైనా ఎలా చెప్తాము అనే ఉద్దేశంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మలబద్ధకం అనేది యుక్తవయస్సులో వచ్చే మొటిమలు వచ్చేంత సాధారణ సమస్యే అది కూడా. అయితే ఈ ఇబ్బందిని వదిలించుకోవడానికి.. మీరు కొన్ని ఇంటి నివారణులు ఫాలో అవ్వొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తగినంత ఫైబర్ తీసుకోండి

ఫైబర్ అనేది మన జీర్ణక్రియను సులభతరం చేసి.. మలబద్ధకం రాకుండా చేస్తుంది. రోజుకు కనీసం 30 గ్రాములు ఫైబర్ తీసుకోవాలి అంటారు. కాబట్టి మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే దోసకాయ, నట్స్, యాపిల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వంటి అధిక ఫైబర్ కలిగిన ఆహారాలను మీ డైట్​లో చేర్చుకోండి.

వెచ్చని పానీయాలు తీసుకోండి..

మీకు మలబద్ధకం ఉంటే.. ఉదయాన్నే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యనుంచి బయటపడాలంటే.. మీరు నిద్ర లేవగానే వెచ్చని పానీయం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగిన వెంటనే.. మీ పెద్దపేగు రిఫ్లెక్స్ హిట్‌ను పొందుతుంది. దీనిని గ్యాస్ట్రో-కోలిక్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. ఇది మలాన్ని బయటకు నెట్టివేస్తుంది.

హైడ్రేటెడ్​గా ఉండండి

నిర్జలీకరణం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా నీరు తాగాల్సి ఉంటుంది. చలికాలంలో తెలియకుండానే నీరు తక్కువ తాగుతాం. కాబట్టి ఈ సమయంలో మీరు కచ్చితంగా నీరు తాగాలని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన పనితీరు కోసం మీరు రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీటిని తాగాలి.

యాక్టివ్​గా ఉండండి

ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే యాక్టివ్​గా ఉండాలి. కాబట్టి మీరు మీ భోజనం తర్వాత తప్పనిసరిగా నడకకు వెళ్లాలి. లేదంటే కొన్ని క్రీడలలో పాల్గొనండి. జిమ్‌కి వెళ్లండి. మీకు నచ్చిన పని ఏదైనా చేయండి. కానీ రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమను ఇవ్వండి. వీటిని ఫాలో అయితే మీరు కచ్చితంగా.. ఈ సమస్య నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా సమస్య వేధిస్తుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

టాపిక్

తదుపరి వ్యాసం