Best Foods to Relive Constipation : మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇవి తినండి
20 October 2022, 17:50 IST
- Best Foods to Relive Constipation : బయట తినేవాళ్లు లేదా నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని డైటీషియన్లు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు కొన్ని ఆహారాలు కూడా తీసుకోవాలి అంటున్నారు. ఇంతకీ అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆహాారాలతో మలబద్ధకం దూరం
Best Foods to Relive Constipation : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెరుగైన జీవనశైలి లేని, ఆహార సంబంధిత సమస్యల కారణంగా ప్రజలలో మలబద్ధకం సమస్య వేగంగా పెరుగుతోంది. మలబద్ధకం సమయంలో కడుపు తరచుగా ఉబ్బిపోతుంది. మలవిసర్జన చేయడం కష్టం అవుతుంది. మలబద్ధకం తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. మీరు మూడు వారాల కంటే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటే.. మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
బయట తినే ఆహారం, నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కడుపునకు మేలు చేసే, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందించే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మలబద్ధకంతో బాధపడేవారు పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. 2014లో నిర్వహించిన ఒక అధ్యయనంలో రెండు వారాలపాటు ప్రతిరోజూ ఉదయం 180 ml పెరుగు తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటూ.. దీర్ఘకాలిక మలబద్ధకం నయం అయిందని పరిశోధకులు నివేదించారు.
కాయధాన్యాలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్, బఠానీలలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గించే పోషకాహారంగా పనిచేస్తుంది. 2017 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో 100 గ్రాముల మొత్తంలో వండిన పప్పులు రోజువారీ ఫైబర్ అవసరాలలో 26 శాతం తీర్చగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. పొటాషియం, ఫోలేట్, జింక్, విటమిన్ B6 వంటి పోషకాలు పప్పులలో కూడా ఉన్నాయి. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం ఇవ్వడంతో పాటు అనేక ఇతర మార్గాల్లో శరీరానికి మేలు చేస్తాయి.
బ్రోకలీ
బ్రోకలీలో 'సల్ఫోరాఫేన్' అనే సమ్మేళనం ఉంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది కాకుండా జీర్ణక్రియను కష్టతరం చేసే పేగులలో అనేక సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. బ్రోకలీ మొలకలు తిన్న వ్యక్తులు మలబద్ధకం లక్షణాలను తక్కువగా కలిగి ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు.
ఆలివ్ నూనె
ఆలివ్, అవిసె గింజల నూనెలో భేదిమందు గుణాలు ఉన్నాయి. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనానికి, పేగుల పనితీరును సులభతరం చేయడానికి చాలా సహాయం చేస్తాయి. ఈ నూనెలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా అవసరమైన సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఆలివ్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌లో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి.
టాపిక్