తెలుగు న్యూస్  /  ఫోటో  /  Liver Healthy Foods | ఈ 5 రకాల ఆహారాలు తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది!

Liver Healthy Foods | ఈ 5 రకాల ఆహారాలు తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది!

12 October 2022, 20:09 IST

శరీరంలో కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. శరీరంలోని మలినాలను తొలగించడం, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడం వంటి ముఖ్య విధుల్లో పాత్ర వహిస్తుంది. కాబట్టి అలాంటి కాలేయానికి సరైన పోషణ అందిస్తూ దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. 

  • శరీరంలో కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. శరీరంలోని మలినాలను తొలగించడం, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడం వంటి ముఖ్య విధుల్లో పాత్ర వహిస్తుంది. కాబట్టి అలాంటి కాలేయానికి సరైన పోషణ అందిస్తూ దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. 
కాలేయం శరీర వివిధ అవసరాలకు శక్తి కేంద్రం. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా 5 రకాల ఆహార పదార్థాలను సూచించారు. అవేంటో మీరూ తెలుసుకోండి.
(1 / 7)
కాలేయం శరీర వివిధ అవసరాలకు శక్తి కేంద్రం. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా 5 రకాల ఆహార పదార్థాలను సూచించారు. అవేంటో మీరూ తెలుసుకోండి.(File photo)
గోధుమ గడ్డి: ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. గోధుమ గడ్డిని తినడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
(2 / 7)
గోధుమ గడ్డి: ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. గోధుమ గడ్డిని తినడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.(Unsplash)
బీట్‌రూట్ జ్యూస్: ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్‌లు, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి కాలేయంలో ఆక్సీకరణ నష్టం, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచుతాయి.
(3 / 7)
బీట్‌రూట్ జ్యూస్: ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్‌లు, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి కాలేయంలో ఆక్సీకరణ నష్టం, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచుతాయి.(ROMAN ODINTSOV)
ద్రాక్ష: ఎరుపు, ఊదారంగు ద్రాక్ష రకాల్లో రెస్వెరాట్రాల్ వంటి అనేక ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి.
(4 / 7)
ద్రాక్ష: ఎరుపు, ఊదారంగు ద్రాక్ష రకాల్లో రెస్వెరాట్రాల్ వంటి అనేక ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి.(Unsplash)
క్రూసిఫరస్ కూరగాయలు: బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తినడం ద్వారా శరీరంలో సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచడంలో సహాయపడతాయి. ఇవి కాలేయం పనిభారాన్ని తగ్గిస్తాయి, కాలేయ ఎంజైమ్‌ల రక్త స్థాయిలను మెరుగుపరుస్తాయి.
(5 / 7)
క్రూసిఫరస్ కూరగాయలు: బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తినడం ద్వారా శరీరంలో సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచడంలో సహాయపడతాయి. ఇవి కాలేయం పనిభారాన్ని తగ్గిస్తాయి, కాలేయ ఎంజైమ్‌ల రక్త స్థాయిలను మెరుగుపరుస్తాయి.(Pixabay)
వాల్‌నట్‌లు: ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో వాల్‌నట్‌లు అత్యంత ప్రయోజనకరమైనవి. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అలాగే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
(6 / 7)
వాల్‌నట్‌లు: ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో వాల్‌నట్‌లు అత్యంత ప్రయోజనకరమైనవి. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అలాగే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి