తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fatty Liver | కాలేయ వాపును తగ్గించే ఆహార పదార్థాలు..

Fatty liver | కాలేయ వాపును తగ్గించే ఆహార పదార్థాలు..

Manda Vikas HT Telugu

04 March 2022, 8:47 IST

google News
    • అతిగా మద్యం సేవించినపుడు కాలేయం ఆల్కాహాల్‌తో నిండిపోతుంది. నియంత్రణ లేని ఆహారం తీసుకోవడం ద్వారా కూడా కాలేయంపై భారం పెరుగుతుంది. ఈ రెండు సందర్భాలలో కాలేయంలో అనవసరమైన కొవ్వు పేరుకు పోయి అది కాలేయ వాపుకు దారితీస్తుంది
కాలేయం
కాలేయం (Shutterstock)

కాలేయం

శరీరంలో అతి ముఖ్యమైన విధులు నిర్వహించే అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది కడుపుకు కుడివైపు ఉంటుంది. సుమారు 3 పౌండ్ల బరువు ఉండే కాలేయం చూడటానికి ఎరుపు-గోధుమ రంగులో, స్పర్శకు రబ్బర్ లాగా ఉంటుంది.

కాలేయం శరీరంలో ఏర్పడే టాక్సిన్స్‌ను తొలగిస్తూ అంతర్గత వ్యవస్థను పరిరక్షిస్తుంది. జీవక్రియను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణమైన ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, ఇతర ప్రయోజనాల కోసం క్రొవ్వును వివిధ అవయవాలలో నిల్వచేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కాలేయంలో కొవ్వుశాతం పెరిగితే దానిని ఫ్యాటీ లివర్ అంటారు.

అతిగా మద్యం సేవించినపుడు కాలేయం ఆల్కాహాల్‌తో నిండిపోతుంది. నియంత్రణ లేని ఆహారం తీసుకోవడం ద్వారా కూడా కాలేయంపై భారం పెరుగుతుంది. ఈ రెండు సందర్భాలలో కాలేయంలో అనవసరమైన కొవ్వు పేరుకు పోయి అది కాలేయ వాపుకు దారితీస్తుంది. సమస్య తీవ్రంకాక ముందే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా అలాగే పోషకాహారం తీసుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గ్రీన్ టీ

ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం మంచి అలవాటు. గ్రీన్ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కాలేయ వాపు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.

తాజా కూరగాయలు

సేంద్రియ విధానంలో పండించిన తాజా కాయగూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జాబితాలో బ్రోకలీ- లేదా కాలిఫ్లవర్ తింటే అదనపు ప్రయోజనాలు కలుగుతాయని తేలింది. పువ్వు గోబిలో కాలేయానికి సంబంధించిన సహజ డీటాక్సిఫై ఎంజైమ్‌ల ఉత్పత్తి పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని సమతుల్యం చేసి, రక్తం స్థాయిలను మెరుగుపరుస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్ తో పాటు ఆకుకూరలు, మొలకలు తీసుకుంటే కాలేయానికి మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్, విటమిన్ సి, విటమిన్ బి6 , సెలీనియం పుష్కలంగా ఉంటాయి, ఇవన్నీ మలినాలను శుద్ధి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అల్లిసిన్ అనేది సల్ఫర్ సమ్మేళనం. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ గుణాను కలిగి ఉంటుంది. సెలీనియం అనేది సహజంగా డీటాక్సిఫై చేసే ఒక మినరల్. ఇది యాంటీఆక్సిడెంట్ల పనితీరును మెరుగుపరచడం ద్వారా కాలేయంపై భారాన్ని తగ్గింస్తుంది. సరైన మోతాదులో వెల్లుల్లి తీసుకుంటే అధిక శరీర బరువు తగ్గడంతో పాటు కాలేయం నుండి కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ తో నిండిని కొవ్వు తొలగిపోతుంది.

కాఫీ

రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండటానికి చాలామంది కాఫీ తాగడానికి మొగ్గుచూపుతారు. నిజానికి కాఫీతో కూడా కొన్ని విభిన్నమైన ప్రయోజనాలున్నాయి. ఫ్రక్టోజ్, కొలెస్ట్రాల్ నిండిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం ద్వారా కాలేయంలో పేరుకుపోయే కొవ్వును కాఫీ కొంతమేర తగ్గిస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ మితంగా కాఫీ తీసుకోవడం ద్వారా కాలేయానికి మేలు కలుగుతుంది.

వీటికి దూరంగా ఉండాలి

వెన్న, నెయ్యి, వనస్పతి, చీజ్ లాంటి డెయిరీ ఫుడ్స్, మాంసం (రెడ్ మీట్) ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. అందువల్ల, వాటిని పూర్తిగా తగ్గించుకుంటే మంది.

టాపిక్

తదుపరి వ్యాసం