తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Harmful Habits Can Damage Your Liver

Liver Health | లివర్‌ని లవర్‌లా ప్రేమగా చూసుకోవాలి.. ఈ చెడు అలవాట్లను మానేయండి!

19 April 2022, 21:36 IST

మనిషి శరీరంలో కాలేయం అతి పెద్ద గ్రంథి. ఇది శరీరంలో ఎన్నో వందల రకాల చర్యలను నిర్వహిస్తుంది. కాబట్టి అలాంటి కాలేయం దెబ్బతింటే అంతా అస్తవ్యస్థం అవుతుంది. ఎక్కువ చక్కెర తినడం, తగినంత నీరు త్రాగకపోవడం లాంటివి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంకా మీరు మార్చుకోవాల్సిన చెడు అలవాట్లు ఇక్కడ ఉన్నాయి.  

  • మనిషి శరీరంలో కాలేయం అతి పెద్ద గ్రంథి. ఇది శరీరంలో ఎన్నో వందల రకాల చర్యలను నిర్వహిస్తుంది. కాబట్టి అలాంటి కాలేయం దెబ్బతింటే అంతా అస్తవ్యస్థం అవుతుంది. ఎక్కువ చక్కెర తినడం, తగినంత నీరు త్రాగకపోవడం లాంటివి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంకా మీరు మార్చుకోవాల్సిన చెడు అలవాట్లు ఇక్కడ ఉన్నాయి.  
ప్రతిరోజూ శరీరంలో జీవక్రియ, జీర్ణక్రియ, టాక్సిన్స్ తొలగింపు, పోషకాల నిల్వ లాంటి అతి ముఖ్యమైన విధుల్లో కాలేయం పాత్ర ఉంటుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్‌ని ఎక్కువగా వాడటం, అధిక ఒత్తిడి తదితర అంశాల వల్ల మీ కాలేయం దెబ్బతింటుంది. కొన్నిసార్లు కాలేయ క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఫోర్టిస్ హాస్పిటల్ లోని కాలేయ మార్పిడి సర్జరీ విభాగంలో కన్సల్టెంట్ & చీఫ్ సర్జన్, డాక్టర్ గౌరవ్ గుప్తా కాలేయాన్ని దెబ్బతీసే హానికర అలవాట్లను తెలియజేశారు, వాటిని మార్చుకోమని ఆయన సూచిస్తున్నారు.
(1 / 8)
ప్రతిరోజూ శరీరంలో జీవక్రియ, జీర్ణక్రియ, టాక్సిన్స్ తొలగింపు, పోషకాల నిల్వ లాంటి అతి ముఖ్యమైన విధుల్లో కాలేయం పాత్ర ఉంటుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్‌ని ఎక్కువగా వాడటం, అధిక ఒత్తిడి తదితర అంశాల వల్ల మీ కాలేయం దెబ్బతింటుంది. కొన్నిసార్లు కాలేయ క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఫోర్టిస్ హాస్పిటల్ లోని కాలేయ మార్పిడి సర్జరీ విభాగంలో కన్సల్టెంట్ & చీఫ్ సర్జన్, డాక్టర్ గౌరవ్ గుప్తా కాలేయాన్ని దెబ్బతీసే హానికర అలవాట్లను తెలియజేశారు, వాటిని మార్చుకోమని ఆయన సూచిస్తున్నారు.(Unsplash)
ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ముందే ప్యాక్ చేసిన రెడీమేడ్ ఫుడ్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటితో కాలేయం చుట్టూ కొవ్వు నిల్వలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది చివరికి సిర్రోసిస్ అనే కాలేయ వ్యాధికి దారి తీస్తుంది.
(2 / 8)
ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ముందే ప్యాక్ చేసిన రెడీమేడ్ ఫుడ్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటితో కాలేయం చుట్టూ కొవ్వు నిల్వలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది చివరికి సిర్రోసిస్ అనే కాలేయ వ్యాధికి దారి తీస్తుంది.(Unsplash)
స్వీట్స్ ఎక్కువ తిన్నా, మద్యం తాగినా ఈ రెండూ కాలేయంపై ఒకే రకమైన ప్రభావం చూపుతాయి. . చక్కెర కలిపిన ఆహారాన్ని ఎక్కువ కాలం తినడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి, కూరగాయలు, పండ్లు వంటి సహజసిద్ధమైన ఆహారాలు తీసుకోవాలి.
(3 / 8)
స్వీట్స్ ఎక్కువ తిన్నా, మద్యం తాగినా ఈ రెండూ కాలేయంపై ఒకే రకమైన ప్రభావం చూపుతాయి. . చక్కెర కలిపిన ఆహారాన్ని ఎక్కువ కాలం తినడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి, కూరగాయలు, పండ్లు వంటి సహజసిద్ధమైన ఆహారాలు తీసుకోవాలి.(Unsplash)
పెయిన్ కిల్లర్లు, నిద్రమాత్రలు, వయాగ్రా, ఇతర మందులు, కొకైన్, గంజాయి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
(4 / 8)
పెయిన్ కిల్లర్లు, నిద్రమాత్రలు, వయాగ్రా, ఇతర మందులు, కొకైన్, గంజాయి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.(Unsplash)
శారీరక శ్రమ లేకపోవడం, ఎలాంటి వ్యాయామాలు చేయకపోవడం లాంటి నిశ్చల జీవనశైలి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)కు దారితీస్తుంది. అదనపు కొవ్వు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.
(5 / 8)
శారీరక శ్రమ లేకపోవడం, ఎలాంటి వ్యాయామాలు చేయకపోవడం లాంటి నిశ్చల జీవనశైలి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)కు దారితీస్తుంది. అదనపు కొవ్వు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.(Unsplash)
అధిక ఒత్తిడితో అధిక కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది. ఇది కాలేయానికి నష్టాన్ని చేకూరుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం, పొగాకు వాడకం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి చెడు అలవాట్లు కాలేయంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి.
(6 / 8)
అధిక ఒత్తిడితో అధిక కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది. ఇది కాలేయానికి నష్టాన్ని చేకూరుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం, పొగాకు వాడకం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి చెడు అలవాట్లు కాలేయంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి.(Unsplash)
శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా, కాలేయానికి హాని కలిగించకుండా నీరు మంచి పని చేస్తుంది. ప్రతిరోజూ తగినంత నీటిని తీసుకోవడం ద్వారా రక్తం పలుచగా మారుతుంది. కాబట్టి ప్రసరణలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాలేయానికి ఏవైనా టాక్సిన్లను ఫిల్టర్ చేయడం, తొలగించడం సులభం అవుతుంది.
(7 / 8)
శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా, కాలేయానికి హాని కలిగించకుండా నీరు మంచి పని చేస్తుంది. ప్రతిరోజూ తగినంత నీటిని తీసుకోవడం ద్వారా రక్తం పలుచగా మారుతుంది. కాబట్టి ప్రసరణలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాలేయానికి ఏవైనా టాక్సిన్లను ఫిల్టర్ చేయడం, తొలగించడం సులభం అవుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి