Tips For Better Sleep | అంజీర్ మిల్క్ ఉపయోగాలు తెలిస్తే అసలు మానరు..-benefits of anjeer milk to better sleep and weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Benefits Of Anjeer Milk To Better Sleep And Weight Loss

Tips For Better Sleep | అంజీర్ మిల్క్ ఉపయోగాలు తెలిస్తే అసలు మానరు..

Vijaya Madhuri HT Telugu
Feb 24, 2022 09:47 AM IST

అంజీర్ మిల్క్. ఇది పెద్దగా ఎవరికి తెలియదు. తెలిస్తే మాత్రం దీనిని తీసుకోకుండా ఉండలేరు. ఎందుకంటే అంజీర్ మిల్క్ వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. నిద్రలేమికి, ఇమ్యూనిటీ పెంచడానికి, బరువు తగ్గడానికి.. ఇలా ఒకటా, రెండా ఎన్నో లాభాలు అంజీర్ మిల్క్​నుంచి పొందవచ్చు.

అంజీర్ మిల్క్ తయారీ
అంజీర్ మిల్క్ తయారీ

Anjeer Milk Benefits |పాలు తాగేందుకు చాలా మంది ఇష్టపడరు. మా పిల్లలు పాలు తాగట్లేదని కొందరు తల్లిదండ్రులు చెప్తే.. మాకు పాలు తాగే అలవాటు లేదని పెద్దలు కూడా చెప్తారు. కానీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పాలలోనే ఉంటాయి. రోజుకో గ్లాస్ పాలు తాగితే కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి వంటివన్నీ పాల ద్వారా అందుతాయి. అలాంటి పాలల్లో పసుపు కలిపి తాగితే ఇంకా మంచిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. 

ఫ్లూ, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే సమయంలో.. చాలా మంది పసుపు కలిపిన పాలు కూడా తాగుతారు. కానీ దాని రుచి నచ్చక చాలా మంది పాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారు పాలల్లో అంజీర్ కలిపి తీసుకుంటే.. పోషకాలకు పోషకాలు అందుతాయి.. టేస్టీగా కూడా ఉంటుంది. అసలు పాలతో అంజీర్ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి...

అంజీర్​తో ఉపయోగాలు ఇవే..

అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎ,సి,కె విటమిన్లతో పాటు.. కాపర్, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలతో అంజీర్ నిండి ఉంది. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారి డైట్​లో అంజీర్ కీలక పాత్ర పోషిస్తోంది. మధమేహంతో బాధపడేవారికి ఏది ఒకపట్టానా సెట్ కాదు. కానీ అంజీర్ వారికో వరమని చెప్పవచ్చు. ఇలాంటి పోషకాలు ఉన్న అంజీర్​ను పాలతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

నిద్రలేమికి చక్కటి పరిష్కారం..

మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. సరిగా నిద్ర లేకుంటే రోజంతా చిరాకుగా ఉంటుంది.  కానీ అంజీర్ మిల్క్​తో దాని స్వస్తి చెప్పవచ్చు. అవును నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇది చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. నిద్రకు ఉపక్రమించే సమయంలో అంజీర్​ను కలిపిన పాలను తీసుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. దీనిలో ఉన్న ట్రైప్టోఫాన్ సెరోటోనిన్​గా మారుస్తుంది. సెరోటోనిన్ మొలాటిన్​గా మార్చి.. అది ప్రశాంతంగా నిద్ర పోయేలా చేస్తుంది.

ఇమ్యూనిటీ పెంచుతుంది..

అంజీర్ మిల్క్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా.. ఎముకలు, దంతాలు ధృడంగా మారేలా చేస్తుంది. అంతేకాకుండా మెదడు పని తీరును చురుకుగా చేస్తుంది. దీర్ఘకాలిక కండరాల నొప్పులు తగ్గించి.. జీర్ణక్రియను సరిచేసి, మెటబాలిజంను పెంచుతుంది.

ఆకలిని అదుపులో ఉంచుతుంది..

అంజీర్ మిల్క్ ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది తరచూ వేసే ఆకలిని.. అదుపులో ఉంచుతుంది. దీంతో ఆహారాన్ని తగిన మోతాదులోనే తీసుకుంటాం.

తక్కువ క్యాలరీలు

బరువు తగ్గాలి అనుకునేవారు క్యాలరీల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి వారికి అంజీర్ మిల్క్ ఒక చక్కని బహుమానమని చెప్పవచ్చు. ఎక్కువ ఫైబర్ కలిగి ఉండి.. తక్కువ క్యాలరీలతో ఉన్న అంజీర్ మిల్క్ బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ

తిన్న ఆహారం జీర్ణమవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు పాలల్లో అంజీర్ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. అంజీర్​లో సహజంగానే జీర్ణక్రియను మెరుగు చేసే గుణం ఉంటుంది.

అంజీర్ మిల్క్ తయారీ విధానం

· ముందుగా కొన్ని అంజీర్​లు తీసుకుని వాటిని ముక్కలుగా కోసి 4 నుంచి 5 గంటలు పాలల్లో నానబెట్టాలి.

· తర్వాత దానిని మిక్సీలో వేసి స్మూతీలాగా పేస్ట్ చేసుకోవాలి.

· ఆ మిశ్రమాన్ని సాస్ పాన్​లోకి తీసుకుని.. ఒక గ్లాస్ పాలు కలపాలి.

· పేస్ట్ పాలల్లో కలిసేలా కలుపుతూనే ఉండాలి.

· అనంతరం దానిలో కొంచెం మోతాదులో కుంకుమ పువ్వు వేసి మరిగించాలి.

· దీనిని వేడిగా అయినా చల్లార్చి అయినా తీసుకోవచ్చు.

ఇన్ని లాభాలు కలిగిన అంజీర్​ మిల్క్​ను మీరు ట్రై చేసి దాని లాభాలను పొందండి.

 

WhatsApp channel

సంబంధిత కథనం