తెలుగు న్యూస్  /  Lifestyle  /  Find 10 Amazing Foods That Can Help Ease Anxiety

foods ease anxiety: యాంగ్జైటీ తగ్గించే 10 అద్భుతమైన ఫుడ్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

28 April 2023, 12:12 IST

    • యాంగ్జైటీని తగ్గించగలిగే శక్తి ఉన్న 10 ఆహారాలను ఇక్కడ చూడండి.
జీడిపప్పు, డార్క్ చాక్లెట్లు యాంగ్జైటీని తగ్గిస్తాయంటున్న నిపుణులు
జీడిపప్పు, డార్క్ చాక్లెట్లు యాంగ్జైటీని తగ్గిస్తాయంటున్న నిపుణులు (Pixabay)

జీడిపప్పు, డార్క్ చాక్లెట్లు యాంగ్జైటీని తగ్గిస్తాయంటున్న నిపుణులు

ఒత్తిడి, యాంగ్జైటీ ఉన్న సమయాల్లో తెలియకుండానే మనం ఎక్కువగా ఉప్పుగా ఉన్న స్నాక్స్ లేదా తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాం. కొద్దిసేపు మన మెదడులో ఆనందాన్ని ఇచ్చే కేంద్రాలను క్రియాశీలంగా ఉండేలా చేస్తుంది. కాసేపు మనం సంతోషంగా ఉండేలా చేస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఈ అధిక కొవ్వు ఆహారాలు బాగా డామేజ్ చేస్తాయి. మరింత యాంగ్జైటీకి, డిప్రెషన్‌కు లోనయ్యేలా చేస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసం, అధిక చక్కెరలు గల ఆహారాలు, టీ, కాఫీ కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ కారణంగా యాంగ్జైటీ లక్షణాలు పెరుగుతాయి. అయితే కొన్ని నిర్ధిష్ట ఆహారాలు యాంగ్జైటీని తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. జీడిపప్పు, బెర్రీ పండ్లు, నారింజ పండ్లు, డార్క్ చాక్లెట్లు, పసుపు వంటి సూపర్ ఫుడ్స్ యాంగ్జైటీని తగ్గిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Heart health and Diabetes : మధుమేహం ఉన్నవారు కార్డియాక్ అరెస్ట్‌ను ఎలా ఎదుర్కోవచ్చు?

Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?

Curd Face Packs : వీటితో కలిపి పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేస్తే మీ ముఖం మెరిసిపోతుంది

Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

‘మీరు తినే తిండి భావోద్వేగ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల ఆహారాలు యాంగ్జైటీ లక్షణాలను తగ్గిస్తాయి. మరికొన్ని పెంచుతాయి. స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు యాంగ్జైటీని ఆహారంతో ఎదుర్కోవడం మంచిది. అయితే మీకు ఏ చికిత్స అవసరమో మీ ఆరోగ్య నిపుణుడు నిర్ణయిస్తాయి. కొన్ని ఆహారాలు యాంగ్జైటీని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. అయితే ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు..’ అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ సర్టిఫైడ్ సైకియాట్రిస్ట్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఉమా నైదూ తెలిపారు.

Anxiety reducing foods: యాంగ్జైటీని తగ్గించే 10 ఆహారాలు

  1. జీడిపప్పు: జీడిపప్పులో ఉండే అధిక మెగ్నీషియం వల్ల మీరు రిలాక్స్ అవుతారు. ప్రశాంతత పొందుతారు.
  2. బెర్రీ పండ్లు: బెర్రీ పండ్లలో యాంటాక్సిడంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మీ శరీరాన్ని, మెదడును ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతాయి. యాంగ్జైటీ మరింత తీవ్రం కాకుండా రక్షణగా నిలుస్తాయి.
  3. బ్రజెల్స్ స్ప్రౌట్స్: వీటిలో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేసే అడ్రినల్ గ్రంథులకు సహాయకారిగా విటమిన్ సీ నిలుస్తుంది.
  4. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్: సాల్మన్ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు యాంగ్జైటీ లక్షణాలను తగ్గిస్తాయి.
  5. పసుపు: పసుపులో కుర్కుమిన్ అనే సమ్మేళనం యాంటీ యాంగ్జైటీ ప్రభావాలను చూపిస్తుంది.
  6. పచ్చళ్లలోని ప్రొబయోటిక్స్: పచ్చళ్లలోని ప్రొబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇది మీ మూడ్‌ను మెరుగుపరుస్తుంది.
  7. అవకాడో: వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, బీ విటమిన్లు లభిస్తాయి. ఇవి స్ట్రెస్‌ను, యాంగ్జైటీని తగ్గిస్తాయి.
  8. ఫ్లేవనాయిడ్లు: డార్క్ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు మూడ్‌ను ఉత్తేజపరిచే బూస్టర్లుగా పనిచేస్తాయి.
  9. ఎల్-థియానిన్: ఇది ఒక అమైనో యాసిడ్. గ్రీన్ టీలో లభిస్తుంది. రిలాక్సేషన్ ఇస్తుంది. నిద్ర బాగా పట్టేలా సాయపడుతుంది.
  10. బచ్చలి కూర: మెగ్నీషియం, పొటాషియం దీనిలో అధికంగా ఉంటాయి. శరీరాన్ని ఈ ఖనిజ లవణాలు ప్రశాంతంగా ఉంచుతాయి.