తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Anxiety: ఆరోగ్యంపై యాంగ్జైటీయా? ఇలా బయటపడండి..

Health Anxiety: ఆరోగ్యంపై యాంగ్జైటీయా? ఇలా బయటపడండి..

HT Telugu Desk HT Telugu

16 February 2023, 14:42 IST

    • Health Anxiety: చాలా మంది లేని అనారోగ్యాన్ని ఊహించుకుని యాంగ్జైటీకి గురవుతారు. దాని నుంచి ఎలా బయటపడాలో థెరపిస్ట్ ఇక్కడ సూచిస్తున్నారు.
అనారోగ్యం గురించి యాంగ్జైటీయా? (ప్రతీకాత్మక చిత్రం)
అనారోగ్యం గురించి యాంగ్జైటీయా? (ప్రతీకాత్మక చిత్రం) (Joice Kelly on Unsplash)

అనారోగ్యం గురించి యాంగ్జైటీయా? (ప్రతీకాత్మక చిత్రం)

స్పష్టమైన లక్షణాలు కనిపించనప్పటికీ కొందరు తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటారు. అనారోగ్య సంబంధిత లక్షణాలు, సంకేతాల గురించి తరచుగా చెక్ చేసుకుంటుంటారు. ఇది క్రమంగా వారిలో ఆరోగ్యం గురించి యాంగ్జైటీకి గురయ్యేలా చేస్తుంది. ఈ పరిస్థితి నేడు చాలా మందిలో కనిపిస్తోంది. మీ ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు ఆందోళన చెందడం సాధారణమే. కానీ భయం, ఆందోళన ఎక్కువై రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం పట్ల ఉండే యాంగ్జైటీని ఎదుర్కోవడం ఒకింత కష్టమే. కానీ ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. చురుకైన విధానం ద్వారా మీరు భయాల నుంచి దూరం కావొచ్చు. తిరిగి మీ జీవితంపై నియంత్రణ సాధించవచ్చు. అందువల్ల ముందుగా హెల్త్ యాంగ్జైటీ లక్షణాలు, హెల్త్ యాంగ్జైటీని దూరం చేసుకునే మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

హెల్త్ యాంగ్జైటీ లక్షణాలు, దానిని డీల్ చేసే సమర్థవంతమైన మార్గాలను థెరపిస్ట్ అలిసన్ సెపొనారా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పంచుకున్నారు.

1. మీ టెస్టులను నమ్మండి

ఇప్పటికే మీరు చాలా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మీ ఆరోగ్యం చక్కగా ఉందని నిర్ధారణ అయింది. ఇక దాని గురించి నిరంతరం వైద్యులను సంప్రదిస్తూ వారి నుంచి పదేపదే భరోసా కోరాల్సిన పనిలేదు. పరీక్షల కోసం నిరంతరం వెళ్లొద్దు. అలాగే నిర్ధారణ కోసం ఇంకా కొంతమంది వైద్యులను కలవడం వంటివి చేయాల్సిన పనిలేదు. అది మీ యాంగ్జైటీని ఇంకా పెంచుతుంది. వైద్యుల నుంచి భరోసా కోరుకోవడం అర్థం చేసుకోదగినదే కానీ పదేపదే దానిని ఆశించడం వల్ల మీ యాంగ్జైటీ, భయాందోళన పెరుగుతాయి.

2. కొత్త సంకేతాలు, లక్షణాల కోసం పదే పదే వెతకొద్దు

హెల్త్ యాంగ్జైటీ ఉన్న వారు కొత్తగా అనారోగ్య సంకేతాలు, లక్షణాల కోసం పదే పదే తనిఖీ చేసుకోవడం మానేయాలి. చాలా సాధారణ అంశాలను కూడా అసాధారణంగా చూడడం మానేయాలి. దీనిని మానేయాలంటే ముందుగా ఈ ప్రవర్తనలను రిపీట్ చేయడం తగ్గించాలి. ఉదాహరణకు మీరు మీ శరీరాన్ని 10 సార్లు తనిఖీ చేస్తున్నారంటే.. క్రమంగా ఆ సంఖ్యను తగ్గిస్తూ పోవాలి. ఇది మీకు సౌకర్యవంతంగా అనిపిస్తుంటే క్రమంగా దానిని మీ నియంత్రణలోకి తెచ్చుకోండి. 

3. నిరంతరం గూగుల్‌లో వెతకడం మానేయండి

మీరు ఆందోళన చెందుతున్న మీ లక్షణాల గురంచి పదేపదే ఇంటర్‌నెట్‌లో వెతకడం మానేయండి. లేదా ఆన్‌లైన్ ఫోరమ్, గ్రూప్స్‌లో ఆయా సంకేతాల గురించి చర్చించడం మానేయండి. అలా వెతకడం మీకు తాత్కాలికంగా ఊరటనిస్తుంది. కానీ అంతిమంగా మీ యాంగ్జైటీని పెంచుతుంది. దీనిని పరిష్కరించడానికి మీరు ఆ వెతుకులాట ఫ్రీక్వెన్సీని తగ్గించండి. క్రమంగా మీకు దానిపై నియంత్రణ వస్తుంది.

4. నిర్ధిష్ట ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందడం

మీరు నిరంతరం ఒక అనారోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్టయితే.. ఆ ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయో గమనించండి. అవి వాస్తవాలు కాకుండా కేవలం మీ ఆలోచనలు మాత్రమేనని గమనించండి. ‘నాకు (ఫలానా) అనారోగ్యం ఉందన్న ఆలోచన వస్తోంది..’ అని మీకు మీరు చెప్పుకోండి. అంటే మీ భయం కేవలం ఆలోచన మాత్రమేనని, వాస్తవం కాదని గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది. అది ఆలోచనగా మీరు గుర్తించినప్పుడు దాని నుంచి మీ అటెన్షన్‌ను మళ్లించడానికి సాధ్యమవుతుంది.

5. మీ ఆరోగ్యం గురించిన భయం మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది:

మీ ఆరోగ్యం గురించి మీరు తీవ్ర భయాన్ని ఎదుర్కొంటుంటే అది మీ రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మీ పనిపై ఏకాగ్రత ఉండదు. అంతిమంగా మీరు వైద్యుడిని ఎక్కువసార్లు సంప్రదించాల్సి వస్తుంది. మీ లక్షణాల గురించి మీరు నిరంతరం వెతుకుతూనే ఉంటారు. ఈ ఫ్రీక్వెన్సీని మీరు క్రమంగా తగ్గించాలి. మీ ఆలోచనలు, భయాలను గమనించడం, స్వీయ ఓదార్పు వంటి కాగ్నిటివ్ డిఫ్యూజన్ పద్ధతులను ఉపయోగించడం మేలు చేస్తుంది. అవసరమైతే థెరపిస్ట్‌ను కన్సల్ట్ అవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం